ఇలా రోజూ రూ.250 ఇన్వెస్ట్ చేస్తే రూ.24 లక్షలు మీ సొంతం..! డబ్బులు 100% సేఫ్..
PPF Scheme: సురక్షితమైన పెట్టుబడి ఎంపికల కోసం చాలా మంది భారతీయులు ఇప్పటికీ ఎంచుకునేందుకు పోస్టాఫీస్, ప్రభుత్వ బ్యాంకులు ముందు వరుసలో ఉన్నాయి. చాలా మంది ఇప్పటికీ రాబడి తక్కువైనప్పటికీ పెట్టిన డబ్బుకు రక్షణ ముఖ్యమని మధ్య, దిగువమధ్య తరగతి ప్రజలు భావిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో పోస్టాఫీసు అందిస్తున్న ఒక ఉత్తమ పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF). ప్రభుత్వ పథకాల నుంచి ఉత్తమ రాబడిని పొందుతూనే పెట్టుబడిగా పెట్టిన మెుత్తం డబ్బును సురక్షితంగా ఉంచుకోవాలనుకునే వారికి మాత్రం ఇది ఉత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ దేశంలోని అన్ని బ్యాంకుల్లో సైతం పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంది. స్కీమ్ కింద పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఏడాదికి కనీసం రూ.500 పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ఏడాదికి గరిష్ఠంగా ఈ స్కీమ్ కింద రూ.1.50 లక్షలు ఇన్వెస్ట్ చేసేందుకు వెసులుబాటు ఉంది.

ప్రస్తుతం పీపీఎఫ్ స్కీమ్ పెట్టుబడిపై 7.1 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. అలాగే దీనికింద చేసే పెట్టుబడులకు పన్న ప్రయోజం కూడా ఉండటం ముఖ్యంగా గమనించాల్సిన అంశం. అయితే పెట్టుబడిదారులు ప్రతిరోజూ రూ.250 క్రమంతప్పకుండా ఇన్వెస్ట్ చేసినట్లయితే నెలకు రూ.7,500 పీపీఎఫ్ కింద పెట్టుబడి లక్షల్లో రాబడిని అందిస్తుంది. ఇలా పెట్టుబడిని వరుసగా 15 సంవత్సరాలు కొనసాగిస్తే మెచ్యూరిటీ సమయంలో ఇన్వెస్టర్ల చేతికి రూ.24 లక్షలు ఆదాయం అందుకుంటారు. ఇదెలా సాధ్యం అని మనలో చాలా మందికి అనుమానం వస్తుంటుంది.
ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి 25 ఏళ్ల వయస్సులో పెట్టుబడిని ప్రారంభిస్తే అతను 40 ఏళ్ల వయస్సు వచ్చే సమయానికి మెుత్తం పెట్టుబడిగా రూ.13.50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. దీనికి స్కీమ్ కింద అందించే 7.1 శాతం రాబడిని కలిపితే మెచ్యూరిటీ సమయానికి దానిపై వడ్డీ ఆదాయం రూ.10,16,760 పొందుతారు. అసలుతో వడ్డీ ఆదాయాన్ని కలిపితే మెుత్తం రూ.23,66,757 అవుతుంది. పైగా ఈ పెట్టుబడిపై వచ్చే రాబడికి ఇన్వెస్టర్లు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. చెల్లింపుల మధ్యలో అవసరమైతే ఖాతాలో జమచేసిన మెుత్తంపై రుణాన్ని సైతం తీసుకునే వెసులుబాటు కల్పించబడింది. PPF ఖాతాపై వడ్డీ రేటు కంటే PPF రుణంపై వడ్డీ రేటు 1 శాతం మాత్రమే ఎక్కువ అంటే రుణాన్ని 8.1 శాతం రేటుకు పొందవచ్చు. జీవితంలో పెద్ద లక్ష్యాలను చేరుకోవాలనుకునే వారు ఈ పన్ను రహిత పెట్టుబడిలో దీర్ఘకాలం కోసం తమ డబ్బును దాచుకోవచ్చు.


Click it and Unblock the Notifications