Post Office Scheme: భారతదేశంలో ఎన్ని పెట్టుబడి పథకాలు వచ్చినప్పటికీ ప్రజలు ఇప్పటికీ పోస్టాఫీసు అందించే స్కీమ్స్ పై ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. పెట్టుబడి భద్రతతో పాటు ప్రభుత్వ హామీ కలిగిన రిస్క్ ఫ్రీ రిటర్న్ ఉండటమే దీనికి ప్రధాన కారణం. పైగా పోస్టాఫీసు సైతం దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా అనేక స్కీమ్స్ లాంచ్ చేయటం చాలా మందిని ఆకర్షిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పోస్టర్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ గురించే. 2023లో ప్రభుత్వం ఈ స్కీమ్ కింద అందిస్తున్న వడ్డీ రేటును సైతం పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికింద 6.7 శాతం వరకు వడ్డీ రేటును స్కీమ్ కింద పెట్టుబడులకు అందించబడుతోంది. అందువల్ల రిస్క్ లేకుండా మంచి రాబడిని అందుకోవాలని ఎవరైనా చూస్తున్నట్లయితే వారికి ఈ స్కీమ్ అత్యుత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు. అలా తక్కువ కాలంలోనే ఎక్కువ రాబడిని పొందటం ద్వారా ఈ స్కీమ్ ఎక్కువగా ప్రజాధరణను అందుకుంది.

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కింద ఎవరైతే క్రమంగా నెలకు రూ.5,000 పెట్టుబడిని కొనసాగిస్తారో వారు మెచ్యూరిటీ సమయంలో రూ.8.5 లక్షలు రాబడిగా అందుకుంటారని వెల్లడైంది. పైగా స్కీమ్ అందిస్తున్న మరో స్పెషల్ వెసులుబాటు ఏంటంటే దీనిపై రుణాన్ని కూడా వారు అవసరమైనప్పుడు పొందటానికి వీలు ఉంటుంది. ముందుగా ఎవరైనా ప్రతి నెల రూ.5,000 రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కింద పెట్టుబడిని 5 ఏళ్ల పాటు కొనసాగించినట్లయితే.. ఈ క్రమంలో వారు రూ.3 లక్షలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. దీనిపై 6.7 శాతం వడ్డీ రేటు చొప్పున రూ.56,830 వడ్డీ మెచ్యూరిటీ సమయంలో కలుపుకుని రూ.3,56,830 అందుకుంటారు.
అయితే అనుకున్న రాబడిని పొందటం కోసం ఇప్పుడు మీరు రికరింగ్ డిపాజిట్ కాలాన్ని మరో 5 ఏళ్లు పొడిగించాల్సి ఉంటుంది. అంటే మెుత్తంగా మీరు నెలవారీ రూ.5000 పెట్టుబడిని 10 ఏళ్ల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ఈకాలంలో స్కీమ్ కింద రూ.6 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. ఈ మెుత్తం పెట్టుబడిపై వడ్డీ రూపంలో ఆదాయం రూ.2,54,272 పొందుతారు. ఇది పూర్తిగా సురక్షితమైన రాబడి కావటం గమనార్హం. వడ్డీతో అసలు కలుపుకుంటే పెట్టుబడిదారులు చివరికి రూ.8,54,272 చేతికి అందుకుంటారు. దీనిని ఎవరైనా సులువుగా ప్రారంభించవచ్చు. తమకు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి వివరాలు కనుక్కుని అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
సాధారణ ప్రజలు సైతం స్కీమ్ కింద పెట్టుబడి పెట్టేందుకు కనీస పెట్టుబడి మెుత్తాన్ని రూ.100కి పరిమితం చేయబడింది. అంటే ఎవరైనా రూ.100 నుంచి తమ రికరింగ్ డిపాజిట్ ప్రారంభించవచ్చు. ముందుగానే పేర్కొన్నట్లు పెట్టుబడిపై రుణ సౌకర్యం కల్పించబడింది. అంటే పెట్టుబడిదారులు డిపాజిట్ చేసిన మెుత్తంలో 50 శాతం వరకు డిపాజిట్ అమౌంట్ రుణం రూపంలో అత్యవసరాల సమయంలో తిరిగి పొందవచ్చు. దీనిపై వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్న రేటు కంటే 2 శాతం అధికంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications