Investment Ideas: ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ధనవంతులు కావాలనే కోరిక ఉంటుంది. దీని కోసం ప్రజలు చాలా కష్టపడుతున్నారు. అయితే సంపాదించినంత సులువు కాదు దానిని సరైన మార్గంలో రెట్టింపు చేసుకోవటం. సరైన ఆర్థిక అవగాహన లేకపోవటం లేదా సరైన ఆర్థిక సూత్రాలు తెలియకపోవటం వల్ల తమ డబ్బును వృద్ధి చేసుకోలేకపోతున్నారు.

చాలా మందిలో అపోహలు..
కోటీశ్వరుడు కావాలంటే చాలా డబ్బు పెట్టుబడిగా పెట్టాలని ప్రజలు అనుకుంటారు. ఇది నిజం కానప్పటికీ. ప్రతినెలా జీతంలో కొంత డబ్బు ఆదా చేస్తూ ఎవరైనా ధనవంతులు కావచ్చు. డబ్బు ఆదాకు చాలా మార్గాలు ఉన్నప్పటికీ.. ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరైన పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల మీరు త్వరగా ధనవంతులు కావచ్చు. అందుకోసం ముందుగా 15*30*20 సూత్రం గురించి తెలుసుకోండి.

50*30*20 నియమం ఏమిటి..?
డబ్బును నిర్వహించడం సంపాదించినంత సులభం కాదు. కొన్నిసార్లు ఎక్కడ ప్రారంభించాలో అర్థం చేసుకోవడం కష్టం. అటువంటి పరిస్థితిలో 50*30*20 నియమం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డబ్బును ఆదా చేసుకోవడానికి ఇదొక గొప్ప మార్గం. ఈ నియమం కింద ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజించుకోవాలి. ఈ నియమం ప్రకారం ఆదాయంలో 50 శాతాన్ని అద్దె, కిరాణా, రవాణా వంటి అవసరాలకు ఖర్చు చేయాలి. ఇదే సమయంలో బయట ఆహారం తినడం, వినోదం, షాపింగ్ వంటి అవసరాల కోసం 30 శాతం ఉంచాలి. ఆదాయంలో మిగిలిన 20% భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టేందుకు వినియోగించాలి.

ఎస్ఐపీ పెట్టుబడులు..
50*30*20 నియమం మిమ్మల్ని ఆర్థికంగా బలపరుస్తుంది. ఇది మీ పొదుపును పెంచుతుంది. ఆదాయంలో మిగిలిన 20 శాతాన్ని SIPలో పెట్టుబడి పెట్టవచ్చు. SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇందులో జేబుపై ఎలాంటి భారం ఉండదు, దీర్ఘకాలంలో రాబడులు కూడా చాలా బాగుంటాయి. 15 సంవత్సరాల పాటు ఏడాదికి 15% చొప్పున ప్రతి నెలా రూ.15,000 పెట్టుబడి పెడితే.. దాదాపు రూ.27 లక్షలు అవుతుంది. దీనిపై వడ్డీ ఆదాయం రూ.73 లక్షల వరకు వస్తుంది. అసలు పెట్టుబడి దానిపై రాబడిని కలుపుకుంటే మెుత్తం రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. అలాగే ఎవరైనా ఈ పెట్టుబడిని 30 ఏళ్ల పాటు కొనసాగిస్తే వారి సంపద రూ.10 కోట్లను మించుతుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications