Investment: సేవింగ్స్ అకౌంట్ కంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) అధిక రాబడిని అందిస్తాయని మనందరికీ తెలుసు. స్థిరమైన ఆదాయం పొందటానికి ఇది మంచి ఎంపిక. మార్కెట్లో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు అనుకునే వారు తమ సొమ్మును టర్మ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఇటీవల పోస్టాఫీసు పొదుపు పథకాల రేట్ల పెంపు తర్వాత చాలా మందికి ఎందులో పెట్టుబడి పెట్టాలని ఆలోచనలో పడ్డారు. ఎలాంటి సందర్భంలో ఏ పెట్టుబడిని ఎంచుకోవటం ఉత్తమమో ఇప్పుడు తెలుసుకుందాం.
టాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు..
చాలా మంది పన్ను ఆదా చేసుకునేందుకు చిన్న పొదుపు పథకమై టాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల వారికి పన్ను ఆదాతో పాటు పొదుపు ప్రయోజనాలు ఏకకాలంలో అందుతాయి. పన్ను ఆదా చేసే FDలు సురక్షితమైన పెట్టుబడులు ఎందుకంటే.. అవి ELSS ప్లాన్‌ల వంటి ఈక్విటీ ఆధారితంగా కాకుండా రుణ ఆధారితమైనవి.టాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల రాబడికి రుణదాతచే హామీ ఇవ్వబడుతుంది. ఆదాయపుపన్ను చట్టంలోని సెక్షన్-80D ప్రకారం ప్రయోజనాలను పొందవచ్చు. ఏడాదికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

దేశంలోని ప్రధాన బ్యాంకులు అందించే తాజా టాక్స్ సేవర్ వడ్డీ రేట్లను గమనిస్తే..
- యాక్సిస్ బ్యాంక్ - 7%
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.5%
- HDFC బ్యాంక్ - 7%
- ICICI బ్యాంక్ - 7%
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ - 6.5%
- బ్యాంక్ ఆఫ్ బరోడా - 6.5%
- కోటక్ మహీంద్రా బ్యాంక్ - 6.2%
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు..
బ్యాంకుల ట్యాక్స్ సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు పథకాల మాదిరిగా.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లకు ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఇవి పన్ను ప్రయోజనాలతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లపై 7.7 శాతం వడ్డీ రేటును ప్రకటించింది. దీనికోసం పోస్ట్ ఆఫీస్‌లో NSC ఖాతాను తెరవడానికి కనీసం రూ.1,000 పొదుపు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంత మెుత్తంలోనైనా డబ్బును ఇన్వెస్ట్ చేయవచ్చు దీనిపై ఎలాంటి పరిమితులు లేవు. ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితులను గమనిస్తే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లపై పొదుపుదారులు ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications