Postal Scheme: 5 ఏళ్లు వరుసగా రాబడి కావాలా..? ఈ పోస్టల్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి
Monthly Income Scheme: దేశంలో ఇప్పటికీ చాలా మంది తమ పెట్టుబడి అవసరాల కోసం ప్రభుత్వ బ్యాంకుల కంటే పోస్టల్ డిపార్ట్మెంట్ పథకాలనే ఎక్కువగా నమ్ముతారు. భారతీయ ప్రజల అవసరాలకు అనుగుణంగా పోస్టల్ డిపార్ట్మెంట్ అనేక స్కీమ్స్ ప్రవేశపెడుతుంటుంది.
పోస్టాఫీసులో సామాన్య ప్రజలను ఆదుకునేందుకు నిరంతరంగా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూనే ఉంది. ఇప్పటికే వాడుకలో ఉన్న ప్రాజెక్టుల్లో లక్షలాది మంది సామాన్యులు పెట్టుబడులు పెట్టారు. పోస్టాఫీసుల్లో మంత్లీ సేవింగ్స్ స్కీమ్ మంచి రాబడిని అందిస్తున్న సంగతి చాలా మందికి ఇప్పటికీ తెలియదు. ఉద్యోగులు తమకు వచ్చే ఆదాయాన్ని ప్రణాళికాబద్ధంగా ఇన్వెస్ట్ చేయటం ఊహించని రాబడులను అందించటంతో పాటు డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.

దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న ధరల మధ్య చాలా మంది ప్రతి నెలా కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సమయాల్లో మంత్లీ సేవింగ్స్ స్కీమ్ నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఈ స్కీమ్ పెట్టుబడిదారులకు అత్యధికంగా 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. దీనికోసం పెట్టుబడిదారులు ఒకే ఖాతా లేదా ఉమ్మడి ఖాతా. పెట్టుబడిదారులు కేవలం రూ.1,000తో MIS ఖాతాను తెరవవచ్చు. MIS ఖాతాలో పెట్టుబడికి గరిష్ట పరిమితి వ్యక్తిగత ఖాతాకు రూ.9 లక్షలుగా ఉండగా.. ఉమ్మడి ఖాతాకు పరిమితి రూ.15 లక్షలుగా ఉంది.
పోస్టాఫీసుల్లో మంత్లీ సేవింగ్స్ స్కీమ్ హామీ ఇవ్వబడిన ఆదాయం సంవత్సరానికి రూ.66,600గా ఉంది. ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి గరిష్టంగా రూ.9 లక్షల వన్-టైమ్ డిపాజిట్ చేసినట్లయితే.. మీరు సంవత్సరానికి 7.4% వడ్డీ రేటుతో నెలకు రూ.5,550 వరకు వడ్డీని ఆదాయంగా పొందవచ్చు. దీని ద్వారా 5 ఏళ్లలో రూ.3.33 లక్షల వరకు స్థిర ఆదాయం లభిస్తుంది. అలాగే జాయింట్ ఖాతాను ఓపెన్ చేసినట్లయితే మెుత్తం పెట్టుబడికి పరిమితి రూ.15 లక్షలుగా ఉంది. ఇది మరింత నెలవారీ ఆదాయన్ని పెట్టుబడిదారులకు అందిస్తుంది.
పోస్టాఫీసులో ఈ ఖాతాను తెరిచేందుకు ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ID కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ అవసరం ఉంటుంది. అలాగే స్కీమ్ కి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు మీ సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించటం ఉత్తమం.


Click it and Unblock the Notifications