PMAY: ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనకు అప్లై చేయండిలా.. బోలెడు ప్రయోజనం కూడా..
ప్రధాన మంత్రిఆవాస్ యోజన అనేది భారత ప్రభుత్వ సాంఘిక సంక్షేమ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్. దీనిని 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. PMAY సమాజంలోని బలహీన వర్గాలకు, తక్కువ ఆదాయ వర్గాలకు, పట్టణ & గ్రామీణ పేదలకు సరసమైన ధరలో గృహాలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించబడింది. 2023 బడ్జెట్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కోసం ఖర్చు 66% పెరిగి రూ.79,000 కోట్లకు పైగా ఉంది. ఈ స్కీమ్ అర్హులైన వారికి ఆర్ఖిక సహకారం అందిస్తుంది. దీనిని పొందటానికి దశలవారీగా ఎలా దరఖాస్తు చేయాలో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అర్హత ప్రమాణాలు:
దరఖాస్తు చేయడానికి మీరు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. భారతదేశంలో మీకు పక్కా ఇల్లు ఉండకూడదు. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం నిర్దేశించిన పరిమితుల్లో ఉండాలి. దీనికి తోడు మీరు ఇతర హౌసింగ్ స్కీమ్‌ల క్రింద ఎటువంటి కేంద్ర సహాయాన్ని పొంది ఉండకూడదు.

దరఖాస్తు ప్రక్రియ:
స్కీమ్ పొందటానికి మీరు అర్హులైతే ముందుగా అధికారిక PMAY వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ 'సిటిజన్ అసెస్‌మెంట్' ఆప్షన్ ఎంచుకుని, వర్తించే కేటగిరీని ఎంచుకోవాలి. 'మురికివాడల నివాసితుల కోసం' లేదా 'ఇతర 3 భాగాల క్రింద ప్రయోజనాలు'. కొనసాగించడానికి మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి. దీని తర్వాత పూర్తి వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. ఇందులో వ్యక్తిగత సమాచారం, అడ్రెస్, ఆదాయ వివరాలు ఉంటాయి. ఫారమ్‌ను సమర్పించే ముందు మొత్తం సమాచారం సరైనదిగా ఉందో లేదో నిర్ధారించుకోవాలి.
పత్ర సమర్పణ:
మీరు అనేక పత్రాలను సమర్పించాలి. వీటిలో ఐడెంటిటీ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ఆదాయ రుజువు ఉన్నాయి. అదనంగా మీరు వర్తిస్తే ఆస్తి పత్రాన్ని అందించవలసి ఉంటుంది.
ధృవీకరణ ప్రక్రియ:
దరఖాస్తుదారులు తమ వివరాలను సమర్పించిన తర్వాత అది ధృవీకరణకు పంపబడుతుంది. అధికారులు మీ అర్హత, పత్రాలను తనిఖీ చేస్తారు. దరఖాస్తు ఆమోదించబడితే దానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను అందుకుంటారు.
సబ్సిడీ పంపిణీ:
అర్హులైన దరఖాస్తుదారులకు హోమ్ లోన్ వడ్డీ రేటుపై సబ్సిడీని అందుకుంటారు. మొత్తం మీ ఆదాయ సమూహం, లోన్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఈ సబ్సిడీ ఇంటి నిర్మాణ ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుంది.
ట్రాకింగ్ అప్లికేషన్ స్టేటస్:
దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ స్థితిని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయవచ్చు. PMAY వెబ్‌సైట్‌ని సందర్శించి అక్కడ 'ట్రాక్ యువర్ అసెస్‌మెంట్ స్టేటస్' ఆప్షన్ ఎంచుకోండి. అప్‌డేట్‌లను వీక్షించడానికి మీ అసెస్‌మెంట్ ID లేదా ఆధార్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ దశలను అనుసరించటం ద్వారా అర్హులు తమ దరఖాస్తును ప్రభుత్వానికి పంపవచ్చు. PMAY స్కీమ్ దేశంలోని చాలా మందికి సొంత ఇంటిని కలిగి ఉండే అవకాశాన్ని కల్పిస్తోంది.


Click it and Unblock the Notifications