Credit Card బిల్ టైంకి కడితే మీకు తెలియని ప్రయోజనాలివే.. వెంటనే తెలుసుకోండి

Credit Card Dues: ప్రస్తుత కాలంలో చాలా మంది క్రెడిట్ కార్డులను విరివిగా వినియోగిస్తున్నారు. ఉద్యోగుల నుంచి వ్యాపారుల వరకు అందరికీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు విరివిగా క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. అయితే ఇక్కడ కార్డు పొందటం ఎంత ముఖ్యమో దానిని సరిగ్గా వినియోగించటం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

ప్రతి బిల్లింగ్ సైకిల్ లోనూ సకాలంలో క్రెడిట్ కార్డ్ చెల్లింపులు చేయటం చాలా ముఖ్యమైన విషయం. ఆర్థిక భద్రతను నిర్ధారించటంతో పాటు ఆలస్య రుసుములను నివారించడం కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. క్రెడిట్ కార్డులను అందించే కంపెనీలు వ్యక్తుల ఆర్థిక స్థితికి అనుగుణంగా లిమిట్ ప్రకటిస్తుంటాయి. కార్డు దారులు బిల్లు చెల్లింపుల కోసం దాదాపు 40 రోజులు గడువు పొందుతారు. దీనిని సరిగ్గా ఉపయోగించటం వల్ల రివార్డులతో పాటు క్రెడిట్ స్కోర్ కూడా మెరుగుపడుతుంది. కార్డుదారులు గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఏమిటంటే.. ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి పేమెంట్ చేసేలా చూసుకోవటం. చెల్లింపులు మిస్ కావటం వల్ల భారీ వడ్డీ రేటుతో పాటు సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది.

Know benefits of paying credit card bills fully ontime

- క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించడం వల్ల కార్డుదారులకు కలిగే ప్రయోజనాలను పరిశీలిస్తే.. ముందుగా చెల్లించని బకాయిలపై విధించే అధిక వడ్డీ ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు. ఇక్కడ వార్షిక వడ్డీ రేట్లు కొన్నిసార్లు 35% నుండి 40% వరకు ఉంటాయి. మిగిలిన అన్ని రకాల రుణాల కంటే క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది రోజువారీ బకాయిపై లెక్కించబడుతుంది. అంటే చెల్లింపులు చేయనిపక్షంలో వేగంగా రుణభారాన్ని పెంచుతుంది. సమయానుకూల చెల్లింపులు డబ్బును మెరుగ్గా నిర్వహించడంలో సహాయపడతాయి.

- వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్‌పై ఉన్న బకాయిల విషయంలో గడువు తేదీలోపు కనీస చెల్లింపును చేయడంలో విఫలమైతే ఆలస్యానికి జరిమానాలు విధించబడుతుంది. మినిమం డ్యూ సకాలంలో చెల్లించటం ద్వారా భారీ పెనాల్టీల నుంచి వినియోగదారులు తప్పించుకోవచ్చు. అయితే కానీ క్రెడిట్ కార్డ్‌లో మిగిలి ఉన్న చెల్లించని మెుత్తంపై వడ్డీ ఉంటుంది. మీరు మీ క్రెడిట్ కార్డ్‌లను సకాలంలో, పూర్తిగా చెల్లించడం ద్వారా ఈ అదనపు రుసుముల నుంచి కాపాడుకోవచ్చు.

క్రెడిట్ కార్డ్ హోల్డర్లు చేసే పని, ఆదాయం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ ముందుగానే నిర్ణీయ లిమిట్ అందిస్తాయి. కార్డు దారులు తమ పరిస్థితులు, ఆదాయ మార్గాలకు అనుగుణంగా వీటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. బిల్ సైకిల్ ప్రకారం ప్రతిసారి సకాలంలో చెల్లింపులు చేస్తే అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితి చెక్కుచెదరకుండా ఉంటుంది. అవసరమైన సమయంలో కార్డు నుంచి డబ్బు వినియోగించుకోవటానికి వెసులుబాటు ఉంటుంది.

వ్యక్తి పేమెంట్ హిస్టరీ అధిక క్రెడిట్ స్కోర్‍కు దారితీస్తుంది. అంటే మీరు క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో, పూర్తిగా సెటిల్ చేసినప్పుడు క్రెడిట్ రిపోర్ట్ చాలా మెరుగ్గా ఉంటుంది. ఇది మొత్తం క్రెడిట్ ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తుంది. ఇక చివరిగా క్రెడిట్ కార్డ్ బకాయిలను గడువు తేదీకి ముందే క్లియర్ చేస్తూ ఉంటే బ్యాంకులు క్రెడిట్ పరిమితిని పెంచవచ్చు. పెద్ద కొనుగోళ్లకు లేదా డబ్బు అవసరమైనప్పుడు అత్యవసర పరిస్థితులకు కార్డులు లైఫ్‌సేవర్‍గా పనిచేస్తాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+