Mutual Funds: ప్రస్తుతం దేశంలో చాలా మంది తమ డబ్బును స్టాక్ మార్కెట్లలో ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో పెట్టుబడిగా పెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. అలా SIP అనే పదం చాలా మందికి పరిచయమైంది.
క్రమపద్ధతిలో కొంత మెుత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడిగా పెట్టడాన్ని SIP అని పిలుస్తారు. ఇది ఆర్థిక క్రమశిక్షణను ప్రజలకు అలవాటు చేస్తుంది. పైగా చిన్న మెుత్తంలో దాచుకోవటాన్ని ప్రోత్సహిస్తుంటుంది. సాధారణంగా ఈ పద్ధతిలో క్రమం తప్పకుండా నిర్థిష్ట తేదీన ముందుగా ఎంపిక చేసిన మెుత్తాన్ని ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఈ మెుత్తాన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు విత్ డ్రా చేసుకునేందుకు కూడా వెసులుబాటు ఉంటుంది. ఇది సాధారణ సిప్ విధానం.

అయితే ఇప్పుడు మనం ఫ్రీడమ్ సిప్ గురించి తెలుసుకుందాం. ఫ్రీడమ్ SIP అనేది మీ సాధారణ SIP ముగిసిన తర్వాత అమలులోకి వస్తుంది. ఇందులో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్, సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్(SWP) అని రెండు భాగాలు ఉంటాయి. ఉదాహరణకు మీరు 8 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 10,000 పెట్టుబడి పెట్టాలని ఎంచుకుంటే.. ఆ తర్వాత మీ SWP ప్లాన్‌ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. మీరు దానిని చేయకపోతే డిఫాల్ట్ SWP ఆప్షన్ ఎంపికచేయబడుతుంది.
ఇక్కడ ఐసీఐసీఐ ఫ్రీడమ్ సిప్ ప్లాన్ గురించి పరిశీలిస్తే.. ఎవరైనా ప్రతినెల రూ.10,000 చొప్పున 8 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టినట్లయితే వారు ఇన్వెస్ట్మెంట్ పిరియడ్ పూర్తైన తర్వాత ప్రతి నెల రూ.10,000 సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ రూపంలో తిరిగి పొందుతారు. అలాగే పెట్టుబడి కాలాన్ని 10 ఏళ్లుగా ఉంటే ప్రతినెల రూ.15,000 SWP రూపంలో పొందుతారు. అలాగే ఎవరైనా ఇన్వెస్టర్ ఇదే పెట్టుబడి విధానాన్ని 30 ఏళ్ల పాటు కొనసాగిస్తే ఆ తర్వాత వారు ప్రతి నెల రూ.1.20 లక్షలను రాబడిగా పొందుతారు. అందుకే ఫ్రీడమ్ సిప్ పెట్టుబడి విధానం భద్రతను కల్పిస్తుంది.


Click it and Unblock the Notifications