High FD Rate: 8.6 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్న బ్యాంక్స్ ఇవే.. పూర్తి వివరాలు..
Fixed Deposit: తెలిసిన వాళ్లకు తెలియని సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం కంటే తక్కువ వడ్డీ వచ్చినా బ్యాంకులో డబ్బులు దాచుకోవటం ఈరోజుల్లో ఉత్తమం. ప్రస్తుతం కొనసాగుతున్న అధిక వడ్డీల కాలం చాలా మందిని బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డబ్బు పార్క్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ప్రస్తుతం సీనియర్ సిటిజన్లు తమ కష్టార్జితాన్ని అధిక వడ్డీ కోసం బ్యాంకుల్లో దాచుకునేందుకు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఎక్కవ వడ్డీ చెల్లిస్తున్న బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల గురించి, అవి చెల్లిస్తున్న వడ్డీ రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి సీనియర్ సిటిజన్లు అత్యధికంగా డిపాజిట్లవైపు మళ్లటానికి ఒక కారణం 50 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేయటమేనని నిపుణులు చెబుతున్నారు. ఇదే క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు సీనియర్ సిటిజన్లను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రేటును ఆఫర్ చేస్తున్నాయి.

స్టేట్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు అదనంగా 100 బేసిస్ పాయింట్ల మేర అధిక వడ్డీని 2222 రోజుల కాలానికి ఆఫర్ చేస్తోంది. ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సాధారణ పెట్టుబడిదారుల కంటే 75 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఈ క్రమంలో రూ.2 కోట్ల కంటే తక్కువ మెుత్తం డిపాజిట్లపై వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న అత్యుత్తమ వడ్డీ రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్లు టీడీఎస్ విషయంలో అధిక థ్రెషోల్డ్‌ను పొందుతారు.
- DCB బ్యాంక్ 25 నుంచి 26 నెలల నిబంధనలతో FDలకు 8.6% సీనియర్ సిటిజన్ రేటును అందిస్తుంది.
- IDFC ఫస్ట్ బ్యాంక్ 500 రోజుల FDలకు 8.5% రేటును అందిస్తుంది.
- బంధన్ బ్యాంక్ ఏడాదిలో మెచ్యూర్ అయ్యే FDలకు 8.35% రేటును అందిస్తోంది.
- ఇదే క్రమంలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంకులు ఏడాది నుంచి రెండేళ్ల కాలానికి సీనియర్ సిటిజన్లకు 8.25% రేట్లు అందిస్తున్నాయి.
- DBS బ్యాంక్ ఇండియా, కరూర్ వైశ్యా బ్యాంక్ వరుసగా 376-540 రోజులు, 444 రోజుల మధ్య కాలానికి చేసే డిపాజిట్లపై 8% వడ్డీ రేటును అందిస్తోంది.
- ఇదే క్రమంలో తమిళనాడ్ మర్చంటైల్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 400 రోజుల కాలానికి చేసే డిపాజిట్లపై 8 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.
దేశంలోని పన్ను చట్టాల ప్రకారం ఎవరైనా వ్యక్తి బ్యాంక్ నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏడాదికి రూ.50,000 కంటే ఎక్కువ ఆదాయం పొందినట్లయితే బ్యాంకులు మూల వద్ద టీడీఎస్ కచ్ చేస్తాయి. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్లు ఫారమ్ 15 హెచ్ సమర్పించటం ద్వారా తమ ఆదాయం పరిమితికి లోబడి ఉన్నట్లయితే టీడీఎస్ కట్ కాకుండా నివారించవచ్చు. ఒకవేళ ఎక్కువ టీడీఎస్ కట్ అయినట్లయితే దానిని పన్ను శాఖ నుంచి తిరిగి క్లెయిమ్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.


Click it and Unblock the Notifications