LIC Policy: ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఖర్చులతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే చాలా మంది భవిష్యత్తు అవసరాల కోసం ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం ఎల్ఐసీ నుంచి మంచి పథకం ఒకటి ఉంది.
ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నది ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ ప్లాన్ గురించి. ఇది పాలసీదారులకు ఇన్సూరెన్స్ కవరేజీతో పాటు ఆదాయాన్ని అందిస్తూ ఏకకాలంలో రెండు ప్రయోజనాలను అందిస్తోంది. పైగా 100 ఏళ్ల వయస్సుకు చేరుకునేంత వరకు కవరేజీ అందుబాటులో ఉండటం విశేషం. 100 సంవత్సరాల వయస్సు వరకు పాలసీ వార్షిక ఆదాయాన్ని అందిస్తుంది.

ఉదాహరణకు మీరు 32 ఏళ్ల వయస్సులో పాలసీలో చేరినట్లయితే సదరు వ్యక్తి 68 ఏళ్ల వరకు కవరేజీని పొందుతారు. దీనితో పాటు ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి మరణించిన సమయంలో కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఉండే డెత్ బెనిఫిట్, టర్మ్ పూర్తి చేసిన వారికి మెచ్యూరిటీ విలువ పాలసీ అందిస్తోంది. ఈ పాలసీని 90 రోజుల పిల్లల నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు కొనుగోలు చేయవచ్చు. పాలసీలో కనీసం ఎంచుకోవలసిన హామీ మెుత్తం రూ.2 లక్షలుగా ఉండగా గరిష్ఠ మెుత్తంపై ఎలాంటి పరిమితి లేదు. అలాగే కనీస పాలసీ వ్యవధి 15 ఏళ్లుగా ఉంది.
మీరు 32 ఏళ్ల వయస్సులో 30 సంవత్సరాల పాలసీని తీసుకుంటే.. 62 సంవత్సరాల వయస్సు నుంచి ఆదాయం లభిస్తుంది. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పాలసీదారుడు సరిగ్గా ప్రీమియం చెల్లించి ప్రీమియం పూర్తి చేస్తేనే ఆ తర్వాతి ఏడాది నుంచి ఆదాయం పొందుతారు. మెచ్యూరిటీ ప్రయోజనం హామీ మొత్తంలో 8% చొప్పున చెల్లించబడుతుంది.
30 ఏళ్ల వ్యక్తి జీవన్ ఉమంగ్ పాలసీని రూ.4.50 లక్షల హామీతో కొనుగోలు చేస్తే.. 30 సంవత్సరాల పాలసీ కాలవ్యవధికి వార్షిక ప్రీమియం రూ.14,770 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రతిరోజూ సుమారు రూ.41 చెల్లించాలన్నమాట. ఇక్కడ పాలసీదారుడు 100 సంవత్సరాల వయస్సు వరకు రూ.4.5 లక్షలలో 8%గా రూ.36,000 పొందుతారు.


Click it and Unblock the Notifications