Tax saving FD: టాక్స్ సేవింగ్ డిపాజిట్లు.. అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్న బ్యాంక్స్ ఇవే..!!
Fixed Deposit: చాలా మంది టాక్స్ పేయర్లు తమ పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఎలాంటి రిస్క్ లేకుండా ఆదాయాన్ని అందించే ఒక పాపులర్ మార్గం బ్యాంక్ డిపాజిట్స్. తక్కువ టాక్స్ బ్రాకెట్లో ఉన్న వారు ఈ టాక్స్ సేవింగ్ ఎఫ్‌డిలను పరిశీలించొచ్చు.
వరుసగా ఆరు సార్లు రిజర్వు బ్యాంక్ రెపో రేటును క్రమంగా పెంచటం వల్ల దేశంలోని అన్ని బ్యాంకులు దానికి అనుగుణంగా తమ వడ్డీ రేట్లను పెంచాయి. ఈ క్రమంలో టాక్స్ సేవింగ్ ఎఫ్‌డిలకు ఆఫర్ చేసే వడ్డీని బ్యాంకులు పెంచాయి. దీంతో చాలా మంది పన్ను చెల్లిపుదారులు వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు మిగిలిన పథకాల కంటే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

ముందుగా ప్రైవేటు రంగానికి చెందిన ఇండస్ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్ పెట్టుబడిపై 7.25 శాతం వడ్డీని ఆఫ్ చేస్తోంది. మీరు రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత రూ.2.15 లక్షలను ఆదాయంగా పొందొచ్చు. వీటి తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్స్ ఖాతాదారులకు ఎఫ్‌డిపై 7 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. ఇక ఫెడరల్ బ్యాంక్ 6.6 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
ఇదే క్రమంలో ప్రభుత్వ రంగంలోని బ్యాంకులను పరిశీలిస్తే యూనీయన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ టాక్స్ సేవింగ్స్ డిపాజిట్లపై 6.7 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. దేశంలో ప్రభుత్వ రంగంలోని అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పెట్టుబడిదారులకు 6.5 శాతం వడ్డీని అందిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ 6.5 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. అయితే బ్యాంక్ డిపాజిట్లపై గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ గ్యారెంట్రీ ఉందని పెట్టుబడిదారులు ముందుగు గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications