Postal Scheme: ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కువ మంది తమ డబ్బును ఇతరులకు వడ్డీకి ఇవ్వటం కంటే సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడిగా పెట్టేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏప్రిల్ 1, 2023న పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేటును 7 శాతం నుంచి 7.5 శాతానికి పెంచింది. దీనిలో పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరి అవసరాల కోసం వివిధ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లు అందించే ప్రయోజనాలతో పాటు అది అందించే రాబడుల గురించి తెలుసుకుందాం.

ముందుగా పోస్టల్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వ హామీతో వస్తాయి కాబట్టి 100 శాతం పెట్టుబడి మెుత్తం సురక్షితంగా ఉంటుంది. అలాగే ఈ చిన్న పొదుపు పథకానికి ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న 7.5 శాతం వడ్డీ ప్రయోజనం అందుబాటులో ఉంది. ఇక్కడ వడ్డీ, అసలు మెుత్తానికి ఎలాంటి రిస్క్ లేకుండా పూర్తిగా హామీ అందుబాటులో ఉంటుంది. స్కీమ్ కింద ఇన్వెస్టర్లు ఏడాది నుంచి 5 సంవత్సరాల వరకు తమ పెట్టుబడి కాలాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు అందుబాటులో ఉంటుంది.
ఏడాది కాలానికి చేసే పెట్టుబడులకు 6.9 శాతం, 2-3 సంవత్సరాలకు చేసే పెట్టుబడులకు 7 శాతం, ఐదేళ్ల కాలానికి పెట్టుబడికి 7.5 శాతం వడ్డీని పోస్టాఫీసు ఆఫర్ చేస్తోంది. ఈ లెక్కన ఎవరైనా ఇన్వెస్టర్ రూ.5 లక్షలను ఐదేళ్ల కాలానికి పెట్టుబడిగా పెట్టినట్లయితే వారికి వడ్డీ రూపంలో రూ.2,24,974 ఆదాయం వస్తుంది. అంటే పెట్టుబడి పెట్టిన మెుత్తం డబ్బు విలువ ఏకంగా రూ.7,24,974కి పెరుగుతుంది. అది కూడా ఎలాంటి రిస్క్ లేకుండానే.
అయితే చాలా మంది మదిలో ఉండే అనుమానం ఈ పెట్టుబడులపై పన్ను మినహాయింపులు ఉంటాయా..? అన్నదే. ఆదాయపుపన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద పెట్టుబడిదారులు పన్ను మినహాయింపును అందుకుంటారు. ఇన్వెస్ట్ చేసేందుకు ఇండివిడ్యువల్ లేదా ఉమ్మడి ఖాతా తెరవవచ్చు. 10 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల పైరుపై ఖాతాను వారి కుటుంబ సభ్యులు తెరవొచ్చు. ఖాతా తెరవటం కోసం కనీసం రూ.1,000 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications