Bank Rates: ప్రస్తుతం ద్రవ్యోల్బణం అధికంగానే కొనసాగుతున్న వేళ రిజర్వు బ్యాంక్ ఇప్పట్లో వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు కనిపించటం లేదు. ఈ క్రమంలో దేశంలోని అనేక బ్యాంకులు జూలై నెలలో తమ మ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)లో మార్పులు చేశాయి. దీని ప్రకారం దేశంలోని 6 ప్రముఖ బ్యాంకులు చేస్తున్న మార్పులు రుణ గ్రహీతలపై ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపనున్నాయి. వాస్తవానికి వివిధ రకాల రుణాల వడ్డీ రేట్లను నిర్ణయించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2014లో MCLR రేటు విధానాన్ని ప్రవేశపెట్టింది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్:
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఓవర్‌నైట్ MCLR రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.05% నుంచి 8.95%కి తగ్గించింది. 1 నెలకు 9% నుంచి 9.10%కి 10 బేసిస్ పాయింట్లు పెరగగా 3 నెలలకు 9.15% నుంచి 9.20%కి 5 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఇదే క్రమంలో బ్యాంక్ 6 నెలల MCLRను 9.30 శాతం నుంచి 9.35 శాతానికి, 1 సంవత్సరం MCLR ను 9.30 శాతం నుంచి 9.40 శాతానికి పెంచింది. మరోవైపు సవరణ తర్వాత 2-3 సంవత్సరాలకు MCLR 9.40 శాతానికి పెరిగింది. ఈ రేట్లు జూలై 8, 2024 నుంచి అమలులోకి వస్తాయి.

యెస్ బ్యాంక్:
యస్ బ్యాంక్ ఓవర్‌నైట్ MCLR 9.10 శాతం. 1 నెలకు MCLR 9.45%, 3 నెలలకు 10.10%, 6 నెలలకు 10.35%, 1 సంవత్సరానికి 10.50%. యెస్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం కొత్త రేట్లు జూలై 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి.
కెనరా బ్యాంక్:
కెనరా బ్యాంక్ ఓవర్‌నైట్ MCLR రేటు 8.20 శాతం. బ్యాంక్ 1 నెల MCLR రేటు 8.30 శాతం కాగా, 3 నెలల MCLR రేటు 8.40 శాతం. మరోవైపు బ్యాంక్ 6 నెలల MCLR 8.75 శాతం, 1 సంవత్సరం MCLR 8.95 శాతం, 2 సంవత్సరాల MCLR 9.25 శాతం, 3 సంవత్సరాల MCLR 9.35 శాతం. కొత్త రేట్లు జూలై 12, 2024 నుంచి అమలులోకి వస్తాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా:
మార్పు తర్వాత, బ్యాంక్ ఆఫ్ బరోడా ఓవర్‌నైట్ MCLR రేటు 8.15 శాతం, 1 నెల MCLR రేటు 8.35 శాతం, 3 నెలల MCLR రేటు 8.45 శాతం, 6 నెలల MCLR రేటు 8.70 శాతం అయితే 1 సంవత్సరం MCLR రేటు 8.90 శాతంగా ఉంది. కొత్త రేట్లు జూలై 12 నుంచి అమలులో ఉన్నట్లు బ్యాంక్ వెల్లడించింది.
IDBI బ్యాంక్:
IDBI బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం తాజా ఓవర్‌నైట్ MCLR 8.40%, 1 నెల MCLR 8.55%, 3 నెలల MCLR 8.85%, 6 నెలల MCLR 9.10%, 1 సంవత్సరం MCLR 9.15%, 2 సంవత్సరాల MCLR 9.70 శాతం 3 సంవత్సరాలు అంటే 10.10 శాతంగా ఉన్నాయి. ఈ రేట్లు జూన్ 12, 2024 నుంచి అమలులోకి వచ్చాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్:
బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఓవర్‌నైట్ MCLR 8.25%, 1 నెలకు MCLR 8.30%, 3 నెలలకు MCLR 8.50%, 1 సంవత్సరానికి MCLR 8.85% అయితే 3 సంవత్సరాలకు MCLR 9.15%. ఈ రేట్లు జూలై 1, 2024 నుండి అమలులో ఉన్నాయని ప్రభుత్వ బ్యాంక్ వెల్లడించింది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications