మన ఆరోగ్యం ఎంత విలువైనదో ఒక్కసారి ఆసుపత్రి బిల్లు చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. చిన్న జ్వరం నుంచి పెద్ద సర్జరీల వరకు వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాంటప్పుడు మనకు వెంటనే గుర్తు రావాల్సింది "హెల్త్ ఇన్సూరెన్స్". కానీ ఇప్పటికీ చాలామంది దీనిని అవసరం లేని ఖర్చుగా భావిస్తున్నారు. కానీ వాస్తవానికి, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక రక్షణ కవచం. ఇది అనుకోని ఆరోగ్య సమస్యల సమయంలో మనకు ఆర్థిక భద్రతను కలిగిస్తుంది. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం? ఎవరు తీసుకోవాలి? ఎలాంటి పాలసీ ఉత్తమం? ఇవన్నీ మనం తెలుసుకుందాం.
హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?
హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక బీమా పాలసీ. ఇది మీరు ఆరోగ్య సంబంధిత ఖర్చులకు డబ్బు ఖర్చు అయినప్పుడు ఈ బీమా మిమ్మల్ని ఆర్థికంగా రక్షిస్తుంది. దీంతో మీరు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, చికిత్సలు, శస్త్రచికిత్సలు, మందులను మొదలైన వాటికి ఖర్చు అయ్యే డబ్బు ఈ బీమా సంస్థ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, తొలిసారి ఆరోగ్య బీమా తీసుకునే వారు కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. లేదంటే పాలసీలో ఉన్న షరతుల వల్ల నష్టాలు జరిగే అవకాశం ఉంది.

హెల్త్ పాలసీ ఎందుకు అవసరం?
సాధారణంగా వచ్చే జలుబు, ఫీవర్ నుంచి గుండె సమస్యలు, శస్త్రచికిత్సలు వరకు అన్ని చికిత్సలకూ వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇలాంటి సమయంలో హెల్త్ పాలసీ ఉండటం మీకు ఆర్థిక భద్రతను కలిగిస్తుంది. ఆసుపత్రి ఖర్చులని బీమా కంపెనీ భరిస్తుంది కాబట్టి మీ జేబు ఖాళీ కాకుండా, అప్పుల పాలవకుండా మీ ఆరోగ్యం పట్ల నిశ్చింతగా ఉండొచ్చు. క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్, ఫ్యామిలీ కవర్, ట్యాక్స్ మినహాయింపు వంటి ప్రయోజనాలు కూడా ఉండటంతో హెల్త్ పాలసీ తీసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం.
ఎంచుకునే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు
ఏ కవరేజ్ ఎన్ని రూపాయల వరకు ఉంది. ఇప్పుడు ఉదాహరణగా ₹3 లక్షల పాలసీ సరిపోతుందా? లేక ₹10 లక్షల పాలసీ అవసరమా? ఇది మీ కుటుంబ పరిమాణం మరియు మీ జీవన ఆధారం బట్టి నిర్ణయించుకోవాలి. తక్కువ ప్రీమియం ఆకర్షణీయంగా అనిపించినా, మొత్తం కవరేజ్ తక్కువ అయే అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు కావాల్సినంత డబ్బులు ఆ బీమా నుంచి పొందలేరు. కాబట్టి ఏ పాలసీ ప్రీమియంని ఎంచుకుంటున్నారో చూసుకుని ఎంపిక చేసుకోండి.
వెయిటింగ్ పీరియడ్ ఉందా?
కొన్ని బీమా పాలసీల్లో కొన్ని ప్రత్యేక రోగాల కోసం 2-4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ పెడతారు. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి. అంటే, పాలసీ తీసుకున్న వెంటనే ఆ ప్రయోజనాలు అందవు. కాబట్టి వాయిదా కాలం ఎంత ఉంది అనే విషయంపై స్పష్టత ఉండాలి.
క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది
ఆసుపత్రిలో చికిత్స అనంతరం బీమా క్లెయిమ్ చేయడంలో మీ పాలసీ ఎంత సులభతరంగా పని చేస్తుంది అనేది తెలుసుకోవాలి. మీరు వెళ్ళే ఆసుపత్రికి క్యాష్‌లెస్ విధానం ఉందా లేక మీరే ముందుగా చెల్లించి తరువాత రీయింబర్స్ చేయాలా? అన్నది తెలుసుకోవాలి.
రెన్యువల్ వయస్సు & లైఫ్‌లాంగ్ రీన్యువబిలిటీ
పాలసీని ఎంత వయస్సు వరకు రెన్యూ చేసుకోవచ్చో చూడాలి. మెరుగైన పాలసీలు జీవితాంతం రెన్యూ చేసుకునే అవకాశం ఇస్తున్నయ్య అనేది చూసుకోవాలి.
ఫ్యామిలీ కవర్ లేదా ఇండివిడ్యువల్ పాలసీ
మీరు కుటుంబం కోసం తీసుకుంటున్నారా, లేక ఒకరికి మాత్రమేనా అని చూసుకొని దాన్నిబట్టి పాలసీని ఎంచుకోవాలి. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని తీసుకుంటే, మొత్తం కుటుంబానికి ఒకే కవర్ ఉంటుంది.
టాప్-అప్ పాలసీ అవసరమా
మీ ప్రాథమిక పాలసీ కవర్ తక్కువగా ఉన్నప్పుడు, అదనంగా టాప్-అప్ పాలసీని తీసుకోవచ్చు. ఇది అధిక ఆరోగ్య ఖర్చులను తక్కువ ఖర్చుతో కవరేజ్ ఇస్తుంది.
బోనస్ & ట్యాక్స్ ప్రయోజనాలు
ఎటువంటి క్లెయిమ్ లేకుండా పాలసీ కొనసాగితే, కొన్ని కంపెనీలు నో క్లెయిమ్ బోనస్ ఇస్తాయి (ఇన్సూరెన్స్ కవర్ పెరుగుతుంది). అంతేకాకుండా, ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 80D ప్రకారం ట్యాక్స్ మినహాయింపు కూడా లభిస్తుంది. ఈ పాయింట్లు తెలుసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య ఖర్చులకైనా ధైర్యంగా ఎదుర్కొనే స్థితిలో ఉంటారు.
హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకోవడం అనేది ఖర్చు కాదు... ఒక పెట్టుబడిగా భావించాలి. ఆరోగ్యం కోసం ముందుగా ప్లాన్ చేసుకోవడం వల్ల మీ మీద, మీ కుటుంబం మీద ఆపద సమయంలో ఆర్థిక ఒత్తిడిని పడనివ్వదు. మొదటిసారి పాలసీ కొనుగోలు చేస్తున్నప్పుడు కాస్త సమయం కేటాయించి, సరైన కంపెనీ, సరైన ప్లాన్ ఎంపిక చేసుకుంటే భవిష్యత్తులో భద్రత కలిగిస్తుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications