బిట్ కాయిన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? కాస్త ఆగండి!
ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు ప్రముఖ ఫైనాన్షియల్ దిగ్గజం జేపీ మోర్గాన్ క్రిప్టోకరెన్సీ గురించి హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో బిట్ కాయిన్ వంటి క్రిప్టో కొనుగోలును పక్కన పెట్టాలని సూచించింది. బిట్ కాయిన్ ఏప్రిల్ నెలలో ఆల్ టైమ్ గరిష్టం 65వేల డాలర్లను తాకింది. ఆ తర్వాత చైనా, ఇరాన్ దేశాల నిర్ణయం, ఎలాన్ మస్క్ వ్యాఖ్యల నేపథ్యంలో 40వేల డాలర్ల దిగువకు వచ్చింది. దీర్ఘకాలంలో పెట్టుబడులకు ఇది మంచి సమయమని, బిట్ కాయిన్ దారుణంగా పతనమైందని పలువురు క్రిప్టో మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జేపీ మోర్గాన్ ఇన్వెస్టర్లకు సూచన చేసింది.

24వేల డాలర్ల నుండి 36వేల డాలర్లు
క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయని, నిలదొక్కుకోవడానికి ముందు కాస్త పడిపోవచ్చునని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ప్రస్తుతం బిట్ కాయిన్ దిద్దుబాటులో ఉందని, మరింత పతనం కావొచ్చునని జేపీ మోర్గాన్ స్ట్రాటెజిస్ట్ నికోలాస్ పనిగిర్టోగ్లో ఓ రీసెర్చ్ నోట్‌లో పేర్కొన్నారు. బిట్ కాయిన్ వ్యాల్యూ మే నెలలో దారుణంగా పడిపోయింది. బిట్ కాయిన్ 24వేల డాలర్ల నుండి 36వేల డాలర్ల మధ్య కదలాడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

మిశ్రమంగా క్రిప్టో
బుధవారం క్రిప్టోకరెన్సీలు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. డోజీకాయిన్ లాభాల్లో ట్రేడ్ అవుతోంది. వరల్డ్ ఆరో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ డోజీకాయిన్ 15 శాతం లాభపడింది. బిట్ కాయిన్, ఎథేరియం స్వల్పంగా క్షీణించాయి. బిట్ కాయిన్ ప్రస్తుతం 37,000 డాలర్ల పైన ఉండగా, ఎథేరియం 2,700 డాలర్ల పైన కదలాడుతోంది.

గూగుల్, ఆపిల్‌తో టై-అప్
బిట్ కాయిన్‌ను ఆమోదించేందుకు కాయిన్ బేస్ గ్లోబల్ వివిధ దిగ్గజ కంపెనీలతో టై-అప్ చేసుకుంది. ఆపిల్ ఇంక్, అల్బాబెట్ గూగుల్‌తో జత కలిసింది. వివిధ దిగ్గజ బ్యాంకులు కూడా క్రిప్టోకు ప్రస్తుతం దూరంగా ఉన్నాయి. ఆర్బీఐ తాజాగా క్రిప్టోను నిషేధించలేదని వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్వాగతించింది.


Click it and Unblock the Notifications