ITC స్టాక్ ధర నేడు 1 శాతం కంటే ఎక్కువగా లాభపడి రూ.234 వద్ద ఉంది. అయినప్పటికీ 52 వారాల గరిష్టం రూ.239.35కు దిగువనే ఉంది. కరోనా నేపథ్యంలో 52 వారాల కనిష్టం రూ.163.35 వద్ద ఉంది. అయితే ఉదయం ఓ సమయంలో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. సోమవారం ఇంట్రాడేలో ఐటీసీ షేర్ ధర 4 శాతం మేర లాభపడి రూ.239.35 వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో రూ.230.25 నుండి రూ.239.40 మధ్య ట్రేడ్ అయింది. ఈ స్టాక్ అంతకుముందు ఫిబ్రవరి 9, 2021న రూ.239.15కి చేరుకుంది. ఈ స్టాక్ గత మూడు సెషన్‌లలోనే 12 శాతం లాభపడింది.
ఐటీసీ స్టాక్ సిగరేట్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(FMCG)కు చెందిన కంపెనీ. సిగరేట్ మార్కెట్‌లో ఐటీసీ వాటా 78 శాతంగా ఉంది. అలాగే, బిస్కట్స్, స్టేపుల్స్, నూడుల్స్, స్నాక్స్, చాకోలేట్స్, డెయిరీ, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ తదితర FMCG ఉత్పత్తుల్లో ఉంది. ఈ కంపెనీ ప్రస్తుతం పేపర్ బోర్డ్, ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ వ్యాపారంలో ఉంది. ఈ ఆదాయం రూ.5,549.21 కోట్లు, అగ్రి వ్యాపారం రూ.8,001 కోట్లు(FY21)గా ఉంది.
కరోనా అన్-లాకింగ్ నేపథ్యంలో ట్రావెల్ వ్యాపారం పెరిగి, ఐటీసీ హోటల్ వ్యాపారం క్రమంగా పుంజుకుంటోంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఐటీసీ సిగరేట్ వ్యాపారం వ్యాల్యూమ్ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రెండేళ్ల ప్రాతిపదికన 21 శాతం క్షీణించింది. అయితే జూన్ నుండి వీక్లీ-వీక్లీ వృద్ధి మాత్రం బాగుంది.

ప్రధానంగా ITC ఎఫ్ఎంసీజీ బిజినెస్ కరోనా సెకండ్ వేవ్ అనంతరం నుండి భారీగా పుంజుకుంటుంది. ఆర్థిక రికవరీ నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ పుంజుకుంటుందని, ఆదాయం 10.4 శాతం మేర వృద్ధి నమోదు చేసిందని చెబుతున్నారు. తలసరి వినియోగం కారణంగా భారతదేశంలో సిగరేట్ వినియోగం సానుకూలంగా ఉందని ఎడెల్వెసిస్ సెక్యూరిటీస్ పేర్కొంది.
వ్యాక్సినేషన్ వేగవంతం కావడం, దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడంతో ఐటీసీ సిగరేట్ వ్యాపారం పూర్తిగా కోలుకుంటోందని ఐసీఐసీఐ సెక్యూరటీస్ పేర్కొంది. ఐటీసీ ఎఫ్ఎంసీజీ బిజినెస్ సగటు సేల్స్ వృద్ధి గత నాలుగేళ్లుగా 9 శాతం పెరుగుతోంది. అయితే FY21-FY24 మధ్య ఈ వృద్ధి 13 శాతం నుండి 14 శాతం ఉంటుందని పేర్కొంది. ఐటీసీ సిగరేట్ వ్యాల్యూమ్స్‌లో రికవరీ కనిపిస్తోందని, వచ్చే త్రైమాసికాల్లో మరింత వృద్ధి నమోదు చేస్తుందని జెఫెరీస్ పేర్కొంది. ఈ బ్రోకరేజీ సంస్థ ఐటీసీ టార్గెట్ ధరను రూ.300కు పెంచింది. భారీ అంచనాల నేపథ్యంలో ఐటీసీ స్టాక్ జంప్ చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications