No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ ట్రాప్లో పడుతున్నారా.. జాగ్రత్త..!
పండుగ సీజన్ వచ్చింది. దీంతో ఈ కామర్స్ సేల్స్ స్టార్ట్ చేశాయి. ప్లీఫ్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివెల్ సేల్ కొనసాగుంది. ఈ సేల్ లో క్రెడిట్ కార్డులపై భారీ తగ్గింపులు, ఇన్ స్టంట్ డిస్కౌంట్లు ఉన్నాయి. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి. చాలా మంది తక్కువలోనే వడ్డీ లేకుండా వస్తువులు కొనుగోలు చేయవచ్చని అనుకుంటారు. కానీ నో కాస్ట్ ఈఎంఐలో వస్తువులు కొనుగోలు చేస్తే అసలు ధర కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. నో కాస్ట్ ఈఎంఐ ద్వారా ఎదైనా వస్తువు కొనుగోలు చేస్తే ముందు ప్రాసెసింగ్ ఫీ తీసుకుంటారు.
ప్రాసెసింగ్ ఫీజు మీద జీఎస్టీ ఉంటుంది. అంత కాకుండా మీరు నెలనెలా చెల్లించే ఈఎంఐ పై కూడా జీఎస్టీ ఉంటుంది. ఫలితంగా మీరు వస్తువు అసలు ధర కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.
ఉదాహరణకు ఒక స్మార్ట్ ఫోన్ ధర రూ.20 వేలు ఉంది అనుకుంటే.. సాధారణంగా క్రెడిట్ కార్డుతో ఒకేసారి చెల్లించి రూ.2 వేల డిస్కౌంట్ తో రూ.18 వేలకే ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అదే మీరు నో కాస్ట్ ఈఎంఐలో కొనుగోలు చేయాలనుకుంటే.. మీకు ఇచ్చే డిస్కౌంట్ డబ్బు అదే క్యాష్ బ్యాక్ బ్యాంకుకు చెల్లిస్తోంది. అంటే మీరు రూ.20 వేలు తిరిగి చెల్లించాల్సిందే. అంతే కాగాడు రూ.99 నుంచి రూ.299 వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.

ఉదాహరణకు మీకు రూ.299 ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తే.. దానిపై దాదాపు రూ.54 జీఎస్టీ పడుతుంది. అంటే మొత్తం రూ.353 చెల్లించాలి. మీరు నెలకు రూ.2 వేల ఈఎంఐ 10 నెలల ఎంచుకుంటే. మీరు ఈఎంఐ రూ.2 వేలతో పాటు జీఎస్టీ కూడా చెల్లించాలి. చివరికి మీరు రూ.21 వేలకు పైగా చెల్లించాల్సి వస్తుంది. సో నో కాస్ట్ ఈఎంఐ వడ్డీ లేదని కొనుగోలు చేస్తే పప్పులో కాలు వేసినట్లే. అందుకే EMIని ఎంచుకునే ముందు, వినియోగదారులు నెలవారీ చెల్లింపును దాటి ఆలోచించాలి. అదనపు ఆర్థిక భారాన్ని భరించడానికి తమ ప్రస్తుత ఆదాయం సరిపోతుందో లేదో అంచనా వేసుకోవాలి.
నో కాస్ట్ ఈఎంఐలో వస్తువు కొనుగోలు చేస్తే క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లించాలి. సరైన సమయంలో డబ్బులు చెల్లించకుంటే క్రెడిట్ స్కోర్ పై ప్రభావం పడుతుంది. దీంతో క్రెడిట్ కార్డు కంపెనీలు భారీగా వడ్డీలు వసూలు చేస్తాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications