అత్యవసర పరిస్థితుల్లో చాలామంది బంగారం రుణాలు, వ్యక్తిగత రుణాల వైపు మొగ్గు చూపుతారు. బంగారంపై ఇచ్చే రుణాలు సెక్యూర్డ్ కాబట్టి వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. అదే పర్సనల్ లోన్(వ్యక్తిగత రుణం) మాత్రం అన్-సెక్యూర్డ్. కాబట్టి వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే ఆయా బ్యాంకును బట్టి, ఆయా కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లు మారుతుంటాయి. అత్యంత అవసరమైతే తప్ప పర్సనల్ లోన్ తీసుకోవద్దని చాలామంది సూచిస్తుంటారు. పర్సనల్ లోన్ పైన ఉన్న అపోహ కారణంగా కొంతమంది ఎంత అత్యవసరం అయినా తీసుకోవడానికి వెనుకాడుతారు.

వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయా?
మిగతా రుణాలతో పోలిస్తే పర్సనల్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు అధికంగా ఉంటుందని భావిస్తారు. అయితే అన్ని సందర్భాలలో ఇది వాస్తవం కాదు. వడ్డీ రేటును బట్టి, బ్యాంకును బట్టి, రుణగ్రహీత సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటు మారుతుంది. అలాగే, తిరిగి చెల్లించే స్తోమతను కూడా పరిగణలోకి తీసుకుంటారు. తక్కువ వడ్డీ రేటుతో పర్సనల్ లోన్ అందించే పలు ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు ఉన్నాయి. ఇటీవల కరోనా మహమ్మారి సమయంలో వడ్డీ రేట్లు భారీగా తగ్గాయి. ఇందులో భాగంగా పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు కూడా క్షీణించాయి.

పర్సనల్ లోన్ అందరికీ..
పర్సనల్ లోన్ కేవలం ఉద్యోగులకే కాదు. వ్యాపారులకు, స్వయం ఉపాధి ఉన్నటువంటి ఇతరులకు కూడా బ్యాంకులు పర్సనల్ లోన్ ఇస్తాయి. దరఖాస్తుదారుల క్రెడిట్ హిస్టరీ ఆధారంగా బ్యాంకులు లోన్ ఇచ్చే విషయాన్ని నిర్ణయిస్తాయి.

ఎన్బీఎఫ్‌సీలు కూడా..
పర్సనల్ లోన్ తీసుకుంటే ముందస్తు చెల్లింపు సదుపాయం కూడా ఉంటుంది. రుణగ్రహీతల వద్ద డబ్బు సర్దుబాటు అయితే కాలపరిమితికి ముందే పూర్తి మొత్తాన్ని చెల్లించవచ్చు. అయితే ఇందుకు ఛార్జీలు వర్తిస్తాయి. కాలపరిమితి కంటే ముందే పూర్తి మొత్తం చెల్లిస్తే దీర్ఘకాలం వడ్డీ రేటును తప్పించుకోవచ్చు.
బ్యాంకులతో పాటు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, డిజిటల్ రుణదాతలు కూడా పర్సనల్ లోన్ అందిస్తాయి.

అసురక్షిత రుణం
హోమ్ లోన్, గోల్డ్ లోన్, వెహికిల్ లోన్ వంటి వాటితో పోలిస్తే పర్సనల్ లోన్ అన్-సెక్యూర్డ్. ఎలాంటి తనఖా లేకుండా మంజూరు చేస్తాయి. గతంలో పర్సనల్ లోన్ రావడానికి రెండు నుండి ఏడు రోజుల వర్కింగ్ డేస్ సమయం పడుతుంది. ఇప్పటికీ దాదాపు అదే సమయం పడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో అదే రోజు కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఎక్కువ డాక్యుమెంటేషన్ అవసరం లేకుండానే రుణాలు మంజూరు చేస్తాయి. ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ కూడా ఉంటాయి. అంటే ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా ఈ ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఇస్తారు.
అయితే అత్యవసర సమయంలో వ్యక్తిగత రుణం కంటే ఎక్కువగా బంగారం రుణం వైపు మొగ్గు చూపే వారు ఉంటారు. ఇది సెక్యూర్డ్ రుణం కాబట్టి బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకు అందిస్తాయి. వ్యక్తిగత రుణాలు దాదాపు 10 శాతం పైన ఉంటాయి. బంగారం రుణాలు 7 శాతం కూడా ఉన్నాయి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు వడ్డీ రేటు 7 శాతంగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 7.30 శాతంగా, కెనరా బ్యాంకు 7.35 శాతంగా ఉన్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications