నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా(NRI)లు దేశంలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతుంటారు. ఇళ్లను నిర్మించి విక్రయిస్తుంటారు. అయితే ప్రతి నెల చెల్లించే అద్దె నుండి టీడీఎస్ మినహాయిస్తున్నారో లేదా తెలుసుకోవాలి. సాధారణంగా అద్దెలో టీడీఎస్ 31.2 శాతంగా ఉంటుంది. అయితే ఎన్నారై యజమాని భారత్‌లో పన్నుకు మించిన ఆదాయం లేదని సర్టిఫికెట్ చూపిస్తే తగ్గే అవకాశం ఉంటుంది.
టీడీఎస్ మినహాయించేందుకు కనీస పరిమితి లేదు. ఉదాహరణకు నెలకు రూ.5వేలు అయితే అధ్దెదారులు టీడీఎస్ చెల్లించాలి. ఇంటి యజమాని ఎన్నారై అయితే టీడీఎస్ సమయానికి చెల్లించాల్సిన బాధ్యత అద్దెకు ఉండేవారిది అవుతుంది.

కిరాయిదారు ముందు ట్యాన్ నెంబర్‌ను పొందాలి. ఆన్‌లైన్‍లో ఎన్ఎస్డీఎల్ వెబ్ సైట్ ద్వారా తీసుకోవచ్చు. ట్యాన్ నెంబర్ వచ్చాక అద్దెకు ఉండేవారు ప్రతి నెల ఆన్ లైన్ ద్వారా టీడీఎస్ చెల్లించవచ్చు. అద్దె రూ.5వేలు అయితే అందులో రూ.1570 (31.2 శాతం) టీడీఎస్‌ను మినహాయించాలి. మిగతా బ్యాలెన్స్ యజమానికి చెల్లించాలి. టీడీఎస్ ప్రతి నెల ఏడో తేదీలోపు అద్దెదారు చెల్లించవలసి ఉంటుంది.
ప్రతి త్రైమాసికం ముగిసిన నెల లోపు అద్దెదారు టీడీఎస్‌ను చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణకు ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి టీడీఎస్ జూలై 31వ తేదీలోగా చెల్లించాలి. అయితే జనవరి - మార్చి త్రైమాసికానికి సంబంధించి టీడీఎస్ మే 31వ తేదీ లోపు దాఖలు చేయాలి. టీడీఎస్ రిటర్న్స్ దాఖలు చేశాక అద్దెదారులు పదిహేను రోజుల్లో ఫామ్ 16ఏలో టీడీఎస్ సర్టిఫికెట్‌ను యజమానికి అందించాలి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications