రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు, గోధుమ ధరలతో పాటు వివిధ ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యా దిగుమతులపై ఆంక్షలు ఎప్పటికప్పుడు కఠినతరం చేస్తున్నాయి. యుద్ధం కారణంగా ధాన్యపు ఓడ రేవులను మూసివేయవలసి వచ్చింది. కమోడిటీస్ మార్కెట్ పైన దీని ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యా నుండి అధికంగా గోధుమలు ఎగుమతి అవుతాయి.

భారత్ నుండ ఎగుమతులు
యుద్ధం ఇలాగే కొనసాగితే, ప్రపంచంలో చాలా వరకు దేశాలు ఆహార కొరతను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కారణం.. ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో ఈ రెండు దేశాలు 29 శాతం వాటాను కలిగి ఉన్నాయి. కొనసాగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, సమీప భవిష్యత్తులో వినియోగం కోసం ప్రపంచవ్యాప్తంగా గోధుమల అవసరం ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో భారత్ నుండి ఎగుమతులు ఉంటే ప్రయోజనం ఉంటుంది.

రష్యాకు ప్రత్యామ్నాయం
2017 నుండి 2021 మధ్య భారత్ కేవలం రెండు శాతం గోధుమలను మాత్రమే ఎగుమతి చేసింది. మిగతా గోధుమను స్టోర్ చేయడం లేదా భవిష్యత్తు దేశీయ అవసరాల కోసం అట్టిపెట్టింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల అక్కడ వ్యవసాయ ఆధారిత సరఫరాలు తగ్గి, పంట నష్టం జరిగి, భారత్‌కు ఎగుమతుల కోసం వెండి రేఖను సృష్టించింది. గోధుమల ఉత్పత్తిలో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. 2022 ఏడాదిలో గోధుమ ఉత్పత్తి 113.3 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. అలాగే, గోధుమ నాణ్యత, ఆకృతి రష్యా పంటకు సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.

ఇప్పటికే పావులు
భారత ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తే, ఉక్రెయిన్, రష్యా దేశాలపై ఆధారపడిన అనేక దేశాలకు భారత్ గోధుమలు ప్రత్యామ్నాయం కావొచ్చు. నివేదికలు చూస్తుంటే భారత ప్రభుత్వం కూడా పక్కా ప్లాన్‌గా ఉందని అర్థమవుతోంది. గోధుమ ఎగుమతులు పెంచాలని చూస్తోంది. అంతర్జాతీయంగా పెరిగిన ధరలను క్యాష్ చేసుకోవచ్చు. గోధుమ ఎగుమతిదారులు 2022లో తమ ఉత్పత్తులను సులభంగా ఎగుమతులు చేసేలా భారత్ ప్లాన్ చేస్తోంది. ఇండోనేషియా, టర్కీ ఇటలీ, నైజీరియాకు ఎగుమతులు పెంచవచ్చు. ఇప్పటికే ఈజిప్ట్‌కు చెందిన ప్రతినిధులు భారత్‌లో సందర్శించేందుకు సిద్ధమయ్యారు.

ఈ స్టాక్స్ అదుర్స్
ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ మార్కెట్‌కు భారత్ గోధుమ ఎగుమతులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎగుమతుల నుండి ప్రయోజనం పొందే కొన్ని కంపెనీలు ఉన్నాయి. అందులో ఐటీసీ, అదానీ విల్మర్, హిందూస్తాన్ యూనీలీవర్ వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications