కమోడిటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది మంచి సమయమా? అంటే ఈ సమయంలో కమోడిటీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిదని ప్రముఖ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ గురు మార్క్ మొబియస్ చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో కమోడిటీ ధరలు పెరుగుతాయనే అంచనాలు, అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆయన మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో వీటిలో ఇన్వెస్ట్ చేయకపోవడమే ఉత్తమం అంటుండటం గమనార్హం. కమోడిటీ మార్కెట్‌కు బదులు ద్రవ్యోల్భణాన్ని అధిగమించగలిగే శక్తి కలిగిన ఈక్విటీ, కంపెనీలలో పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచిస్తున్నారు.
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటం, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సహా వివిధ అంశాల కారణంగా ద్రవ్యోల్భణం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుందనే ఆందోళనలు ఉన్నాయి. కాబట్టి కమోడిటీస్‌కు బదులు ద్రవ్యోల్భణాన్ని అధిగమించగలిగే శక్తి కలిగిన కంపెనీలు, ఈక్విటీలలో పెట్టుబడి పెట్టాలన్నారు. కరోనా తర్వాత కమోడిటీస్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. చాలా ఉత్పత్తుల ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక పెరుగుదలను నమోదు చేశాయి.

కరోనా తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఆ తర్వాత రష్యా పైన అమెరికా, యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించడం వంటి వివిధ అంశాలు ప్రభావం చూపాయి. దీంతో కమోడిటీ ధరలు పెరిగాయి. దీనికి అనుగుణంగా కమోడిటీ స్టాక్స్ కూడా పుంజుకున్నాయి. అయితే సమీప భవిష్యత్తులో పుంజుకున్నప్పటికీ, ఆ తర్వాత కాస్త శాంతించే అవకాశాలు ఉన్నాయని, దీనిని పరిగణలోకి తీసుకోవాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

స్టాక్ మార్కెట్‌లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్‌లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications