Credit Card: వామ్మో.. క్రెడిట్ కార్డ్ బిల్లు ఈఎంఐగా మార్చితే సిబిల్ స్కోర్ తగ్గుతుందా..?
CC Bill Convertion: క్రెడిట్ కార్డులను ఎక్కువగా వినియోగించటం అనేది వాస్తవానికి వెస్ట్రన్ కల్చర్. కానీ ప్రస్తుతం ఇది ఇండియాకి కూడా విస్తరించిన సంగతి తెలిసిందే. అమెరికాలో డెట్ ఎకానమీ కారణంగా డాలర్ చెలామణి ప్రపంచ వ్యాప్తంగా సులభతరం అయిన సంగతి తెలిసిందే. అయితే డిజిటలైజేషన్ కారణంగా ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం ఊపందుకుంది.
దేశంలోని బ్యాంకులతో పాటు ఆర్థిక సంస్థలు సైతం ప్రజలకు గతంలో కంటే సులభంగా క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో డెబిట్ కార్డుల యుగం నుంచి ప్రజలు క్రెడిట్ కార్డుల వినియోగానికి, యూపీఐ చెల్లింపులకు మారారు. అయితే అవసరాలకు మించి వీటిని ఉపయోగించి సకాలంలో బిల్లు చెల్లించలేక భారీ వడ్డీ చెల్లించేవారి సంఖ్య నేటి కాలంలో పెరిగిపోతోంది. షాపింగ్ మాల్స్ నుంచి కిరాణా దుకాణాల వరకు అన్ని చోట్ల వీటి వినియోగం పెరిగిపోయింది.

ఈ క్రమంలో చాలా మంది అతిగా వినియోగిస్తూ.. పెద్ద బిల్లు మొత్తాలను చెల్లించడానికి ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి కస్టమర్ల నుంచి క్రెడిట్ కార్డ్ కంపెనీలు బిల్లులను EMIలుగా మార్చుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఈ ఎంపికను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు తక్షణ ఉపశమనం పొందవచ్చు. కానీ బిల్లు మొత్తాన్ని EMIలుగా మార్చుకోవటం వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా అనే అనుమానాలు చాలా మంది కార్డు యూజర్లలో ఉంది.
తరచుగా అధిక బిల్లు వచ్చినప్పుడు క్రెడిట్ కార్డ్ వినియోగదారులు మొత్తం బిల్లును ఒకేసారి చెల్లించే బదులు నెలవారీ వాయిదాల్లో చెల్లించుకోవటానికి వాటిని సులభరమైన వాయిదాలుగా మార్చుకుంటుంటారు. దీనిపై కంపెనీ వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా వసూలు చేస్తుంది. ఇలా కన్వర్ట్ చేసుకోవటం వల్ల కార్డుదారుని క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభావితం కాదని నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ బ్యూరోలు మీరు చెల్లింపులను ఎలా చేస్తున్నారనే దానిని కాకుండా చెల్లింపుల విఫలాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంటాయి. అందువల్ల ఎలాంటి చెల్లింపు సమస్యలను క్రియేట్ చేయదు.
అయితే ఇక్కడ కన్వర్ట్ చేసిన ఈఎంఐ చెల్లింపుల్లో విఫలమైతే మాత్రమే క్రెడిట్ స్కోర్ తగ్గింపుకు కారణం అవుతుంది. క్రెడిట్ కార్డ్ బిల్లును ఈఎంఐగా మార్చడం వల్ల అనేక ప్రయోజనాలతో పాటు కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. బిల్లును చిన్న మొత్తాలుగా విభజించడం ద్వారా నిధుల కొరత ఉన్న సమయంలో చెల్లింపులను విఫలం కాకుండా పూర్తి చేసుకోవటానికి ఇది దోహదపడుతుంది.


Click it and Unblock the Notifications