Gold: బంగారు ఆభరణాలు కొనడం పెట్టుబడా లేక వస్తువు కొనడమా..!

చాలా మంది పొదుపు చేయాలనుకుంటారు. పొదుపు, పెట్టుబడుల విషయానికి వస్తే ముందుగా గుర్తుకు వచ్చేది బంగారం. అయితే బంగారం పెట్టుబడా లేక కేవలం ఒక వస్తువా అనే దానిపై చాలా మందికి డౌట్ ఉంది. దీనిపై ఎడెల్‌వైస్ మ్యూచువల్ ఫండ్ అధిపతి రాధికా గుప్తా దీనిపై వివరణ ఇచ్చారు. భౌతిక పెట్టుబడులకు, ఆర్థిక పెట్టుబడులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ఆమె పేరొన్నారు. మహిళలు వ్యక్తిగత ఉపయోగం కోసం బంగారం కొనడం, పెట్టుబడి కోసం కొనడం అనే వాటిని వేరువేరుగా చూడాలని సూచిస్తున్నారు. చాలా మంది తాము కొన్న ఆభరణాలను సులభంగా అమ్మడానికి ఇష్టపడరు.

అంతేకాకుండా భౌతిక రూపంలో బంగారం కొనుగోలు చేసినప్పుడు, దానిని భద్రంగా ఉంచడానికి అధిక ప్రాసెసింగ్ ఫీజులు, నష్టాలు, జీఎస్టీ, నిల్వ ఖర్చులు ఉంటాయని ఆమె చెప్పారు. ఇదే మీ పోర్ట్‌ఫోలియో అంటే పెట్టుబడి అయితే, దయచేసి ఫైనాన్షియల్ గోల్డ్, అంటే గోల్డ్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లను కొనండి అని ఆయన సిఫార్సు చేస్తున్నారు. దీనిలో ఇంట్లో నగలను ఉంచుకోవాలనే చింత లేకుండా, బంగారం ధర పెరిగినప్పుడల్లా మీరు దాని నుంటు ప్రయోజనం పొందవచ్చు. మనం ఇచ్చే డబ్బులో అధిక భాగం పెట్టుబడి పెట్టబడుతుందని, అంటే కమీషన్, నష్టం పేరుతో గణనీయమైన మొత్తం డబ్బు నగలలోకి వెళ్తుందని కూడా రాధికా గుప్తా చెప్పారు.

Gold Price

పెట్టుబడి మొత్తాన్ని బంగారంలోనే నిలిపి ఉంచే బదులు, ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని కూడా రాధిక గుప్తా సూచిస్తున్నారు. వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియోలో బంగారం కేవలం ఒక భాగం మాత్రమే అయి ఉండాలని అన్నారు. అంతేకాకుండా, భారతదేశంలో సొంత ఇల్లు కొనడం అనేది కేవలం ఖాతాను చూడటం లేదా స్ప్రెడ్‌షీట్ ఫోటో తీసుకోవడం ద్వారా జరిగే విషయం కాదని, అది చాలా భావోద్వేగమైన అంశమని ఆయన చెప్పారు. అందువల్ల, సొంత ఇల్లు కొనడాన్ని ఒక పెట్టుబడిగా చూడకూడదని ఆమె తెలిపారు. మనం నివసించే ఇంటిని ఎప్పుడూ పెట్టుబడి ఆస్తిగా పరిగణించకూడదని స్పష్టం చేశారు. ఇల్లు మనకు భద్రతను, మనశ్శాంతిని ఇస్తుంది, కానీ మనకు అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు దానిని వెంటనే అమ్మలేమని గుర్తుంచుకోవాలన్ని చెప్పారు.

చాలా మందికి వారి పదవీ విరమణ సమయంలో అనేక ఇళ్లు ఉండవచ్చు, కానీ వారి చేతిలో నగదు లేకపోతే వారు ఇబ్బంది పడతారని ఆమె అన్నారు. మనం నివసించే ఇల్లు కాకుండా, పెట్టుబడి కోసం కొనుగోలు చేసిన స్థిరాస్తి ఆస్తులు కూడా నిజమైన ఆస్తులేనని తెలిపారు. బంగారం, విలాస వస్తువులు, ఇళ్లు విలువైనవే. కానీ విలువకు దాని ఆర్థిక వినియోగానికి తేడా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలని సలహా ఇచ్చారు. రాధికా గుప్తా చాలా సంవత్సరాలుగా ఆర్థిక మార్కెట్‌లో చురుకుగా ఉన్నారు. ఆమె విలక్షణమైన పెట్టుబడి సలహాలు ఇవ్వడమే కాకుండా, బిలియన్ల రూపాయల విలువైన పెట్టుబడి సంస్థను కూడా విజయవంతంగా నడుపుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+