పండుగలు, వివాహాలు దగ్గరగా ఉన్నప్పుడు, ఆభరణాలు కొనడానికి ఇన్‌స్టాల్మెంట్స్‌లో బంగారం కొనడం చాలా మందికి సాధారణ అలవాటు. జ్యువెలర్స్ అందించే "గోల్డ్-సేవింగ్ స్కీమ్"లు ఈ అవసరాన్ని సులభతరం చేస్తాయి. ఈ స్కీమ్ ద్వారా మీరు ప్రతి నెల ఒక స్థిరమైన డబ్బులు చెల్లించడమే కాక, తర్వాత మీ ఇష్టమైన బంగారం కోసం రిడీమ్ చేసుకోవచ్చు. మీరు ఆ ప్లాన్ తీసుకునే ముందు ఈ పాయింట్లు గురించి తెలుసుకొని అప్పుడు మొదలెట్టండి.
1. స్కీమ్ ఎలా పని చేస్తుందో తెలుసుకోండి:
సాధారణంగా ఈ స్కీమ్‌లు 10-12 నెలలపాటు ఉంటాయి. ప్రతి నెల మీరు ఒక స్థిరమైన మొత్తాన్ని పొదుపు చేస్తారు. చివరికి ఆ మొత్తం విలువకు తగిన బంగారం కొనవచ్చు. కొన్ని స్కీమ్‌లు బోనస్‌లను కూడా అందిస్తాయి, ఉదాహరణకు ఒక నెల ఇన్‌స్టాల్మెంట్ మిస్ అయినా క్షమించడం లేదా డిపాజిట్ పై తక్కువ వడ్డీ ఇవ్వడం. కానీ ప్రతి స్కీమ్ షరతులు వేరేలా ఉండవచ్చు, కాబట్టి సైన్ చేసేముందే మోతం క్లియర్ గా చదవాలి.

2. ప్యూరిటీ, మేకింగ్ ఛార్జ్‌లను తనిఖీ చేయండి:
ప్యూరిటీ మరియు మేకింగ్ ఛార్జ్‌లను తప్పకుండా తనిఖీ చేయండి. ఎందుకంటే మేకింగ్ ఛార్జ్‌లు, వేస్టేజ్ ఖర్చులు మొత్తం పొదుపు చేసిన డబ్బులో తగ్గించవచ్చు. కొన్ని స్కీమ్‌లు కేవలం 22K బంగారం మాత్రమే కొనడానికి ఇస్తాయి, మరికొన్నింటిలో కొన్ని రకాల ఆభరణాలకే పరిమితం ఉంటాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం బంగారం కొనాలనుకుంటే, బంగారం బిళ్ల్స్ లేదా నాణేలుగా కొనగలరా అని కూడా ముందే తెలుసుకోవడం అవసరం.
3. స్కీమ్ రిగ్యులేటెడ్ ఉందో చూసుకోండి:
స్కీమ్ రిగ్యులేటెడ్ ఉందా అని తప్పకుండా తనిఖీ చేయాలి. ఎందుకంటే చాలా జ్యువెలర్స్ అందించే గోల్డ్ సేవింగ్ స్కీమ్‌లు RBI యొక్క నియంత్రణలో ఉండవు. అలా ఉంటే, ఆ జ్యువెలర్ బిజినెస్ నిలిచిపోతే మీ పెట్టుబడి సురక్షితంగా ఉండకపోవచ్చు. కాబట్టి, నమ్మకమైన, పాపులర్ చైన్‌లు నడిపే స్కీమ్‌లు లేదా SEBI నియంత్రణలో ఉండే డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫారమ్‌లకు లింక్ అయ్యిన స్కీమ్‌లను ఎంచుకోవడం చాలా మేలు. ఇది మీ డబ్బును సురక్షితంగా ఉంచడమే కాక, సమస్యలు తలెత్తినా క్లెయిమ్ చేసుకోవడం సులభతరం చేస్తుంది.
4. అన్ని చెల్లింపుల రసీదులు తీసుకోండి:
అన్ని చెల్లింపులకు రసీదు తప్పకుండా తీసుకోండి. ప్రతి నెల ఇన్‌స్టాల్మెంట్ చెల్లించినప్పుడు రసీదు లేదా ఎలక్ట్రానిక్ కన్ఫర్మేషన్ పొందడం చాలా ముఖ్యం. డాక్యుమెంట్లు లేకుండా నగదు చెల్లించడం మానుకోండి, ఎందుకంటే రిడీంప్షన్ సమయంలో మీరు చెల్లించిన మొత్తం సురక్షితం కాబట్టే ఇది అవసరం.
5. ఇతర ఆప్షన్‌లతో పోల్చండి:
ఇన్‌స్టాల్మెంట్ స్కీమ్ ఎంచుకునే ముందు, జ్యువెలర్ ద్వారా అందించే స్కీమ్‌లను ఇతర ప్రత్యామ్నాయాలుతో పోల్చి చూడటం మంచిది. ఉదాహరణకు, సొవరిన్ గోల్డ్ బాండ్స్ లేదా గోల్డ్ ETF లాంటి ఆప్షన్‌లు ప్రభుత్వ మద్దతు కలిగివుంటాయి, అంటే మీ డబ్బు ఎక్కువ భద్రతతో ఉంటుంది. వీటిలో ఎక్కువ పారదర్శకత ఉంటుంది, డిపాజిట్లపై వడ్డీ లాభం పొందవచ్చు, అలాగే బంగారం ధర మార్పులను కూడా ట్రాక్ చేయవచ్చు. అందువల్ల, జ్యువెలర్ స్కీమ్‌తో పాటు ఈ ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించి, మీ అవసరానికి అనుగుణంగా సరికొత్త నిర్ణయం తీసుకోవడం మంచిది.
సరైన ప్లానింగ్, జాగ్రత్త మరియు పరిశీలనతో, ఇన్‌స్టాల్మెంట్స్‌లో బంగారం కొనడం ఒక సులభమైన మరియు పొదుపు మార్గంగా ఉంటుంది. మీరు నమ్మకమైన జ్యువెలర్లు, రసీదులు, ఫైన్ ప్రింట్ షరతులపై కూడా దృష్టి పెడితే, మీ బంగారం పెట్టుబడి సురక్షితం గా ఉంటుంది. ఈ విధంగా, పండుగలు, వివాహాల సందర్భంలో మీ ఇష్టమైన బంగారం సులభంగా పొందవచ్చు.


Click it and Unblock the Notifications