అగ్ని ప్రమాదాలపై పాలసీ: ఏప్రిల్ 1 నుండి ఈ మూడు బీమా పాలసీలు తప్పనిసరి
ఏప్రిల్ 1వ తేదీ నుండి అగ్ని ప్రమాద, అనుబంధ ప్రమాదాలను కవర్ చేస్తూ మూడు ప్రామాణిక ఉత్పత్తులు తప్పనిసరిగా అందించాలని ఇన్సురెన్స్ రెగ్యులేటర్ IRDAI... జనరల్ ఇన్సురెన్స్ కంపెనీలను ఆదేశించింది. స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్స్(SFSP) పాలసీ స్థానంలో కొత్త పాలసీలను ఏప్రిల్ 1 నుండి ఈ పాలసీలను అందుబాటులో ఉంచాలని తెలిపింది. SFSP స్థానంలో భారత్ గృహ రక్ష, భారత్ సూక్ష్మ ఉద్యమ్ సురక్ష, భారత్ లఘు ఉద్యమ్ సురక్ష పాలసీలు ప్రవేశ పెట్టాలని బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ తెలిపింది.

వాటి కోసం ఈ మూడు పాలసీలు
పై మూడు స్టాండర్డ్ బీమా పాలసీలను ప్రవేశపెట్టాలని IRDAI తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ బీమా ఉత్పత్తులు పాలసీదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించామని, ఇంకా చెప్పాలంటే సాధారణ ప్రజానీకం సౌకర్యార్థం తెస్తున్నట్లు తెలిపింది. వాటర్ ట్యాంకుల ఓవర్ ఫ్లో, పేలుడు, తీవ్రవాద చర్యలతో, సమ్మెలు, అల్లర్లు, ఇతరత్రా హానికర నష్టాలతో ధ్వంసమైన ఇళ్లకు భారత్ గృహ రక్ష పాలసీ వర్తిస్తుందని, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల కోసం భారత్ సూక్ష్మ ఉద్యం సురక్ష, భారత్ లఘు ఉద్యం సురక్ష పాలసీలు ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొంది.

బీమా హామీ..
భారత్ గృహ రక్ష పాలసీలో ఇంటితోపాటు ఇంట్లో వస్తువులకు ఆటోమేటిక్‌గా బీమాలో 20 శాతం కవరేజీ (గరిష్టంగా రూ.10 లక్షలు) లభిస్తుంది. ఈ వ్యాల్యూకు మించి వస్తువులు ఉంటే ప్రపోజల్ పత్రంలో పేర్కొనడం ద్వారా కవరేజీని పొందవచ్చు. భారత్ సూక్ష్మ ఉద్యమ్ సురక్ష సంస్థల కోసం ప్రత్యేకంగా తయారు చేసినది. రూ.5 కోట్ల వరకు రిస్క్ కవర్‌ను ఇందులో భాగంగా ఆఫర్ చేయాలి. భారత్ లఘు ఉద్యమ్ సురక్ష పాలసీ రూ.5 కోట్లకు పై నుండి రూ.50 కోట్ల వరకు సంస్థల కోసం బీమా కవరేజీని ఆఫర్ చేస్తుంది.

యాడ్ ఆన్ కవర్
భారత్ సూక్ష్మ ఉద్యోమ్ సురక్ష, భారత్ లఘు ఉద్యమ్ సురక్ష ఎంఎస్ఎంఈల ఆర్థిక పరిరక్షణకు ఉపయోగపడతాయి. కాగా, పై మూడు పాలసీలపై ఇన్సురెన్స్ కంపెనీలు వినూత్న యాడ్ ఆన్(అదనపు కవర్)కు కూడా IRDAI అనుమతించింది.


Click it and Unblock the Notifications