భారతీయ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC), SBI కార్డ్ కొత్తగా IRCTC SBI Cardను లాంచ్ చేశాయి. దీనిని రూపే కార్డు ప్లాట్‌ఫాంపై దీనిని ఆవిష్కరించాయి. ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు గరిష్ట లాభంతో పాటు, రిటైల్, భోజన, వినోద ప్రయోజనాలు, ఇతర ట్రాన్సాక్షన్ మినహాయింపులు ఉంటాయి. ఈ క్రెడిట్ కార్డు ద్వారా రైల్వేకు చెందిన ట్రాన్సాక్షన్స్ అన్నీ డిజిటల్‌గా, సురక్షింగా ఉంటుంది. వ్యక్తిగత వివరాలు, మొబైల్ నెంబర్, అడ్రస్ ప్రూఫ్ సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి.

ప్రయోజనాలెన్నో..
రూపే IRCTC SBI కార్డు కలిగి ఉన్నవారు AC1, AC2, AC3, AC CC బుకింగ్స్ పైన 10 శాతం వ్యాల్యూను తిరిగి పొందుతారు. IRCTC వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవాలి. కార్డు యాక్టివేషన్ తర్వాత 1 శాతం ట్రాన్సాక్షన్ ఫీజు మినహాయింపు ఉంటుంది. అలాగే 350 బోనస్ రివార్డు పాయింట్లు పొందుతారు. ఇలా వచ్చిన అన్ని రివార్డు పాయింట్లతో ఇండియన్ రైల్వేస్ వెబ్ సైట్‌లో ఉచితంగా టిక్కెట్లను రీడీమ్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్లలో 3 నెలలకు ఒకసారి ఏడాదిలో నాలుగుసార్లు ప్రీమియం లాంజ్ ఉచితం.

షాపింగ్, డిస్కౌంట్
ఈ కార్డులో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) టెక్నాలజీ ఉంది. కార్డును కేవలం ట్యాప్ చేయడం ద్వారా సురక్షిత, వేగవంతమైన ట్రాన్సాక్షన్ పూర్తి చేయవచ్చు. 2021 మార్చి వరకు ఎలాంటి ఎంట్రీ ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఐఆర్సీటీసీ బుక్ చేసే టిక్కెట్లపై ఒక శాతం డిస్కౌంట్ ఉంది. ఈ క్రెడిట్ కార్డుతో వినియోగదారులు టికెట్లు బుక్ చేసుకోవడంతోపాటు ఆన్‌లైన్ షాపింగ్, డిస్కౌంట్ పొందవచ్చు. బిగ్ బాస్కెట్, ఆక్స్‌వై, ఫుడ్‌ఫర్ ట్రావెల్, ఏజియో వంటి వాటిలో షాపింగ్ చేసే సమయంలో కస్టమర్లు ఆకర్షణీయ డిస్కౌంట్లు పొందవచ్చు. మెడ్ లైఫ్‌లో 20 శాతం డిస్కౌంట్ ఉంది. ఫిటెర్నిటీపై 25 శాతం డిస్కౌంట్ ఉంది.

రూ.300 వరకు ఆఫర్
ఈ కార్డు వెల్‌కం బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. పాథాలజీపై 40 శాతం, మెడిసిన్ పైన 18 శాతం, కోర్సెస్ అప్‌గ్రేడ్ పైన 10 శాతం మినహాయింపు ఉంది. మమెర్త్, అపోలో ఫార్మసీలో పది శాతం డిస్కౌంట్ ఉంది. మింత్రాలో రూ.300 వరకు, క్యూమాత్‌పై 15 శాతం, బాటాపై 25 శాతం తగ్గింపు ఆఫర్స్ ఉన్నాయి. వృత్తి, వ్యాపారరీత్యా తరచూ రైలు ప్రయాణం చేస్తున్న వారికి అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications