న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకు SBI, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) కలిసి ప్రయాణీకులకు అద్భుతమైన ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి తమ కస్టమర్లకు సరికొత్త IRCTC SBI కార్డు ప్రీమియర్‌ను అందిస్తున్నాయి. ఈ కార్డుతో కస్టమర్లకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

రూ.2,000 బోనస్ పాయింట్లు, బుక్ మై షో టిక్కెట్లు
- ఈ ప్రీమియం కార్డు తీసుకున్న కస్టమర్‌కు తొలి సంవత్సరం యాన్యువల్ ఫీజు చెల్లించినప్పుడు రూ.1,500 లేదా 1,500 బోనస్ పాయింట్లు వస్తాయి.
- మొదటి 60 రోజుల్లో రూ.2,000 ఖర్చు చేస్తే బుక్ మై షోకు చెందిన రూ.500 విలువ కలిగిన మూవీ వోచర్లు వస్తాయి.
- బోనస్ రివార్డు పాయింట్లు IRCTC SBI ప్లాటినమ్ కార్డు అకౌంట్‌లోకి క్రెడిట్ అవుతాయి.
- ఈ బోనస్ పాయింట్లు 45 రోజుల్లో అకౌంట్లోకి వస్తాయి.
- ఇవి మాత్రమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

రైలు, ఎయిర్ టిక్కెట్లపై 10 శాతం, 5 శాతం క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్
- www.irctc.co.in ద్వారా AC1, AC2, AC3, AC CC రైళ్లలో బుక్ చేసుకుంటే 10 శాతం వ్యాల్యూ బ్యాక్ బెనిఫిట్స్ ఉంటాయి.
- ఎయిర్ టిక్కెట్ కొనుగోలుపై 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది.
- air.irctc.co.in, ecatering.irctc.co.in. ద్వారా భోజనం కొనుగోలు చేస్తే కూడా 5 శాతం క్యాష్ బ్యాక్ ఉంటుంది.

రూ.50 వేలు ఖర్చు చేస్తే 2500 బోనస్ పాయింట్స్
- జీరో పేమెంట్ గేట్ వే ఛార్జీలు ఆఫర్ చేస్తుంది. IRCTC వెబ్ సైట్ ద్వారా రైలు టిక్కెట్ బుక్ చేసుకుంటే పేమెంట్ గేట్ వే ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. www.irctc.co.in, air.irctc.co.in. ద్వారా బుక్ చేసుకుంటే సాధారణంగా 1.8 శాతం ఉంటుంది. ఇది సేవ్ చేయవచ్చు.
- ఏడాదిలో ట్రావెల్ ఖర్చులు రూ.50,000 దాటితే రూ.2,500 బోనస్ పాయింట్స్ వస్తాయి. అదేవిధంగా రూ.1 లక్ష ఖర్చు దాటితే 5,000 బోనస్ పాయింట్లు ఉంటాయి.
- రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తే వార్షిక రుసుము ఆధారంగా రివర్సల్ బెనిఫిట్స్ ఉంటాయి.

రూ.10 లక్షల వరకు ఇన్సురెన్స్
- కాంప్లిమెంటరీ ఇన్సురెన్స్ కవర్ ఉచితంగా పొందవచ్చు. కాంప్లిమెంటరీ రైలు ప్రమాద ఇన్సురెన్స్ రూ.10 లక్షలు, కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ రూ.50 లక్షలుగా ఉంది.
- ఫ్రాడ్ లయబులిటీ కవర్ రూ.1 లక్ష వరకు ఉంది.
- జాయినింగ్ ఫీజు రూ.1,499 ఉంటుంది. ప్రతి సంవత్సరం రూ.1,499 చెల్లించాలి. యాడ్ ఆన్ కార్డు తీసుకోవడానికి ఫీజు ఉండదు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications