ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) స్టాక్ నేడు ఓ సమయంలో నాలుగు శాతం మేర లాభపడింది. అప్పుడు ఈ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1 లక్ష కోట్ల మార్కును తాకింది. అయితే ఆ తర్వాత IRCTC స్టాక్ భారీగా నష్టపోయింది. IRCTC నిన్న రూ.5877 వద్ద ముగిసింది. నేడు (మంగళవారం, అక్టోబర్ 19) ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైంది. నాలుగు శాతానికి పైగా లాభపడినప్పుడు మార్కెట్ క్యాప్ రూ.1 లక్ష కోట్లు దాటగా, ఆ తర్వాత 8 శాతానికి పైగా కూడా ఎగిసిపడింది. కానీ చివరి గంటలో భారీగా నష్టపోయిన IRCTC స్టాక్ రూ.5000కు దిగువన ముగిసింది. నేడు ఒక్కరోజే రూ.6,000కు పైన పలికిన ఈ స్టాక్ రూ.4,996 వద్ద ముగియడం గమనార్హం. నేడు ఎనిమిది శాతానికి పైగా లాభపడిన స్టాక్, మార్కెట్ క్లోజింగ్ సమయానికి 15 శాతం పతనమైంది.

రూ.1400 మేర పైకీ కిందకు
IRCTC ఉదయం రూ.6,175.00 వద్ద ప్రారంభమైంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.6,396.30ను తాకింది. నేడు ఈ స్టాక్ రూ.4,996.05 వద్ద ముగిసింది. నేటి కనిష్టం కూడా ఇదే. ఉదయం రూ.1 లక్ష కోట్లు దాటిన ఈ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చివరికి భారీగా నష్టపోవడంతో రూ.85 వేల కోట్లకు చేరుకుంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్టం నేటి రూ.6,396.30. 52 వారాల కనిష్టం రూ.1,290.05. IRCTC స్టాక్ నేడు రూ.1,400 మేర పైకి, కిందకు కదలాడింది. చివరకు 15 శాతం లేదా రూ.881.65 నష్టపోయింది. బీఎస్ఈ డేటా ప్రకారం ఈ సంస్థ మార్కెట్ క్యాప్ రూ.1 లక్ష కోట్లు దాటడం ఇదే మొదటిసారి.

భారీ రిటర్న్స్
IRCTC స్టాక్ గత ఏడాది కాలంలో 364 శాతం రిటర్న్స్ ఇచ్చింది. గత దసరా నుండి మల్టీ బ్యాగర్లుగా మారిన స్టాక్స్‌లో IRCTC ఒకటి. గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్స్ ఏవీపీ రీసెర్చ్ గౌరవ్ శర్మ ప్రకారం ఇప్పటికీ IRCTC స్టాక్ అద్భుతంగా కనిపిస్తోంది. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ రూ.4,000 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని డిప్ సమయంలో కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. లాంగ్ పొజిషన్‌లో కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు.
IRCTC గత ఐదు సెషన్‌లలో 30 శాతం, గత నెల రోజులలో 70 శాతం ఎగిసిపడింది. ఆరు నెలల కాలంలో దాదాపు 300 శాతం ఎగిసింది. ఏడాది కాలంలో 360 శాతం లాభపడింది. IRCTC స్టాక్ ఇష్యూ ధరతో పోలిస్తే 1800 శాతానికి పైగా ఎగిసింది.

నిపుణుల అంచనా..
IRCTC స్టాక్ ఇప్పటికే భారీగా లాభపడిందని, ఊహించని విధంగా పరుగులు పెట్టిందని, కాబట్టి కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని ఇదివరకే మార్కెట్ నిపుణులు సూచించారు. చెప్పినట్లుగానే నేడు 15 శాతం క్షీణించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా IRCTC 59వ స్థానంలో ఉంది. ఈ స్టాక్ రానున్న 28 నెలల నుండి 32 నెలల కాలంలో భారీగా లాభపడే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. జూలై 30, 2021న IRCTC స్టాక్ స్ప్లిట్ ప్లాన్‌ను ప్రకటించింది. ఆ తర్వాత బోర్డు IRCTC స్టాక్ స్ప్లిట్ రేషియో 1:5తో ఆమోదం తెలిపింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications