దేశంలో ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థల్లో ఇండియన్ రైల్వేస్ ముందుంటుంది. దీని ఆన్ లైన్ వింగ్ IRCTC. ఇది టిక్కెట్ బుకింగ్, కేటరింగ్ వంటి వివిధ సేవలు అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం అంటే లైఫ్ టైమ్ గ్యారెంటీ! ఇండియన్ రైల్వేస్ ఈ-టికెటింగ్ వాటా మొత్తం రిజర్వ్డ్ టిక్కెట్లలో 55 శాతం వరకు ఉంటాయి. IRCTC టిక్కెట్ బుకింగ్ ఏజెంట్‌గా మారితే నెలకు రూ.80,000 వరకు సంపాదించుకోవచ్చు.

సింగిల్ వ్యాలెట్ సిస్టం ద్వారా..
ఆథరైజ్డ్ IRCTC ఏజెంట్లు అన్ని రకాల టిక్కెట్లను బుక్ చేయవచ్చు. తత్కాలి, వెయిటింగ్ లిస్ట్, RAC తదితర బుకింగ్స్, లావాదేవీలపై అద్భుతమైన కమిషన్ పొందవచ్చు. అన్ని రైళ్లకు సంబంధించి 24x7 లైవ్ సెర్చ్ ఇంజిన్ బుకింగ్ సిస్టం వీరికి అందుబాటులో ఉంటుంది. అన్ని రైళ్లను సెర్చ్ చేసుకోవచ్చు. లభ్యతను చూసుకోవచ్చు. PNR స్టేటస్ యాక్సెస్, క్విక్ ఇంటర్‌ఫేస్ వంటి ఫీచర్లతో సింగిల్ వ్యాలెట్ సిస్టం ద్వారా IRCTC ఏజెంట్లు ప్రయాణీకుల కోసం టిక్కెట్లు బుక్ చేయవచ్చు.

నెలకు రూ.80,000 సంపాదించవచ్చునట
ఈ సింగిల్ వ్యాలెట్ సిస్టం యూజర్ ఫ్రెండ్లీగా ఉండటంతో పాటు వేగవంతంగా పని చేస్తుంది. అక్బర్ ట్రావెల్స్ డాట్ కామ్... IRCTC ఏజెంట్‌గా పని చేసి నెలకు రూ.80,000 వరకు కూడా సంపాదించుకోవచ్చునట.

కేవలం రైలు టిక్కెట్లే కాదు...
IRCTC ఏజెంట్ అధికారిక వెబ్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఏజెంట్లకు ప్రొఫెషనల్, ఫ్రెండ్లీ సపోర్ట్ సేవలు కూడా లభిస్తాయి. IRCTC ఏజెంట్ లైసెన్స్ కూడా లభిస్తుంది. ఏజెంట్‌కు ఆన్‌లైన్ అకౌంట్ ఇస్తారు. ఈ అకౌంట్ ద్వారా వారు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు కూడా బుక్ చేసుకోవచ్చు. బస్సు టిక్కెట్ బుకింగ్, హోటల్ బుకింగ్, హాలీడే, టూర్ ప్యాకేజీ, మనీ ట్రాన్సుఫర్, ప్రీపెయిడ్ రీఛార్జ్ వంటి వివిధ సౌకర్యాలు కూడా ఉంటాయి.

IRCTC ఏజెంట్ ఎలా కావొచ్చు
అధీకృత ప్రిన్సిపల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు సైనిన్ కావడం ద్వారా ఏజెంట్‌గా మారవచ్చు. ప్రిన్సిపల్ సర్వీస్ ప్రొవైడర్ పూర్తి వివరాలు వెబ్ పోర్టల్ ద్వారా పొందవచ్చు. లేదంటే ఈ-రైల్ వంటి థర్డ్ పార్టీ వెబ్ సైట్స్ కూడా ఏజెంట్ సర్వీసులు అందిస్తున్నాయి.

టిక్కెట్ల బుకింగ్ పైన...
రెండు రకాల బుకింగ్ ఏజెన్సీ ఆప్షన్స్ ఉన్నాయి. మొదటి ప్లాన్‌లో వన్ ఇయర్ ఎన్ర్జీ ఛార్జీలు ఉంటాయి. దీని కోసం రూ.3,999 చెల్లించాలి. రెండో ప్లాన్.. టూ ఇయర్ ఏజెన్సీ ఛార్జీలు ఉంటాయి. దీనికి రూ.6,999 చెల్లించాలి. 100 వరకు టిక్కెట్లు బుక్ చేస్తే ఒక్కో టిక్కెట్ పైన రూ.10 ఛార్జ్ ఉంటుంది. 101 నుంచి 300 టిక్కెట్ల వరకు రూ.8 చార్జ్ వసూలు చేస్తారు. 300కు పైగా టిక్కెట్స్ బుకింగ్ పైన రూ.5 ఛార్జ్ ఉంటుంది. నాన్ ఏసీ క్లాస్ టిక్కెట్స్ పైన కమిషన్ టిక్కెట్‌కు రూ.20 ఉంటుంది. ఏసీ క్లాస్ అయితే టిక్కెట్‌కు రూ.40 కమిషన్ ఉంటుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications