స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే భారీ రాబడులు రావొచ్చు. కొన్నిసార్లు నష్టపోవచ్చు కూడా. అయితే ఎంపిక చేసిన స్టాక్స్, రంగాలలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మాత్రం మంచి రిటర్న్స్ పొందవచ్చు. అయితే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. స్టాక్ గురించి, ఆ రంగం గురించి, కంపెనీ హిస్టరీ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. 2020లో కరోనా కారణంగా దేశీయ మార్కెట్ భారీగా నష్టపోయినప్పటికీ, ఆ తర్వాత కోలుకొని, ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది.

60వేల కోట్లు పెరిగిన మార్కెట్ క్యాప్
దేశీయ స్టాక్ మార్కెట్లు 2021-22 ఆర్థిక సంవత్సరంలో అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చాయి. నిన్నటి గురువారంతో ముగిసిన 2021-22 (ఏప్రిల్-మార్చి) ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్(BSE) ప్రధాన సూచీ సెన్సెక్స్ గత ఆర్థిక సంవత్సరంలో 18 శాతం ఎగిసిపడింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ ఈ ఒక్క ఏడాది రూ.59,75,686 కోట్లు పెరిగి రూ.2,64,06,501 కోట్లకు చేరుకుంది.

18 శాతం రిటర్న్స్
ద్రవ్యోల్బణం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణలు, అంతర్జాతీయంగా ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లు వృద్ధిబాటలో పయనించాయి. మొత్తం 2021-22లో సెన్సెక్స్ 9,059 పాయింట్లు లేదా 18.29 శాతం ఎగిసిపడింది. 2022 ఏడాది జనవరి 17న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ గతంలో ఎన్నడు లేనివిధంగా రికార్డ్‌స్థాయిలో రూ.280 లక్షల కోట్లను దాటింది. గత ఏడాది అక్టోబర్ 19న బీఎస్ఈ సెన్సెక్స్ 62,245 పాయింట్లను క్రాస్ చేసి, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఇక, నిఫ్టీ 19 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
వివిధ రంగాల విషయానికి వస్తే మెటల్, మీడియా 50 శాతం రిటర్న్స్ ఇచ్చింది. మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 ఇరవై ఐదు శాతం చొప్పున రిటర్న్స్ ఇచ్చాయి.

మరింత రిటర్న్స్ వచ్చేవే కానీ..
అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు భయాలతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అధిక ధరలు వంటి ప్రతికూలతలు గడిచిన మూడు నెలల్లో మార్కెట్‌కు భారీగా గండికొట్టాయని చెబుతున్నారు. లేదంటే సూచీలు మరింత అధిక రిటర్న్స్ ఇచ్చి ఉండేవి. కాగా, దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరం నష్టాలతో వీడ్కోలు పలికింది.


Click it and Unblock the Notifications