ప్రభుత్వ సెక్యూరిటీల వైపు ఇన్వెస్టర్ల చూపు, ఎందుకంటే?
కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేరకు పెంచడంతో బ్యాంకులు డిపాజిట్ల సేకరణకు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే వివిధ కాలపరిమితుల డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచాయి. అయినప్పటికీ డిపాజిటర్లకు అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పలువురు ఇన్వెస్టర్లు ప్రభుత్వ సెక్యూరిటీస్ వైపు చూస్తున్నారు. వీటిలో వడ్డీ రేటు 7 శాతానికి మించి ఉంది. ఇది ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
ఇదివరకు ప్రభుత్వ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్‌మెంట్‌కు అంతగా ఆదరణ ఉండేది కాదు. రిటైర్డ్ ఉద్యోగులు, సురక్షిత పెట్టుబడి పథకాలను ఎంచుకునే వారు మాత్రమే ఇటువైపు చూసేవారు. కానీ సాధారణ ఇన్వెస్టర్లు ఎక్కువగా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ పథకాల వైపు చూసేవారు. అయితే ఇప్పుడు చిన్న ఇన్వెస్టర్లకు ప్రభుత్వ బాండ్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పించే లక్ష్యంతో గత ఏడాది ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్‌ను తీసుకు వచ్చింది. ఇది ప్రభుత్వ సెక్యూరిటీల వైపు చూడటానికి ఉపయోగపడుతోంది.

ఇటీవల బాండ్స్ అందించే వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. టెన్ ఇయర్ గవర్నమెంట్ సెక్యూరిటస్ రాబడి ఏడాది కాలంలో 125 బేసిస్ పాయింట్లు పెరిగింది. చాలామంది దీర్ఘకాలిక వ్యూహంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. కానీ ఎన్ఎస్సీ 6.8 శాతం, కిసాన్ వికాస్ పత్ర 6.9 శాతంగా ఉంది. ఆర్బీఐ ఆరు నెలల ఫ్లోటింగ్ బాండ్స్ వడ్డీ రేటు 7.15 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications