Mutual Funds: దేశంలో ప్రస్తుతం ఈక్విటీలపై కంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై ఇన్వెస్టర్లు మక్కువ చూపుతున్నారు. అయితే చాలా మందికి దీని ద్వారా కోటీశ్వరులుగా మారే అసలైన ఫార్ములా తెలియదు.
భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కువ మంది రిస్క్ లేకుండా రిటర్న్స్ కావాలని అనుకుంటుంటారు. ఈ క్రమంలో ఎక్కువ మంది ఎస్ఐపీలను ఎంచుకుంటున్నారు. పైగా దీర్ఘకాలం కోసం పెట్టుబడి పెట్టే వారు దీని నుంచి ఖచ్చితంగా మెరుగైన రాబడులను అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైగా వీటిని అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు నిర్వహించటం వల్ల ఎలాంటి ఆందోళన లేకుండా మెరుగైన రాబడులను పొందొచ్చు.

సిస్టమేటిక్ ఇన్వెస్మెంట్ ప్లాన్(SIP) రూపంలో చాలా మంది పెట్టుబడులు పెడుతూనే ఉంటారు. అయితే కోటి రూపాయల టార్గెట్ అందుకోవటానికి ఒక ఫార్ములా ఉంది. అదే చాలా ఫేమస్ అయిన 15*15*15 స్ట్రాటజీ. దీనికి అర్థం ఏమిటంటే ఎవరైనా పెట్టుబడిదారుడు నెలకు రూ.15,000 చొప్పున.. 15 ఏళ్ల పాటు.. 15 శాతం రాబడి అందించే ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే వారు ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారతారు. దీని వెనుక కాంపౌండింగ్ ఫార్మాలా అతిపెద్ద మ్యాజిక్ చేస్తోంది. సామాన్యులను సైతం కోటీశ్వరులుగా మారేందుకు ఈ ఫార్ములా కింద రోజుకు రూ.500 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెడితే సరిపోంతుందన్న మాట.
ఎవరైనా కోటీశ్వరుడిగా మారాలనుకునే ఇన్వెస్టర్ క్రమం తప్పకుండా ఈ ప్రణాళిక ప్రకార 15 ఏళ్ల పెట్టుబడిని కొనసాగిస్తే వారు అక్షరాలా కోటి రూపాయల కంటే ఎక్కువ రాబడిని పొందుతారు. ఈ కాలంలో పెట్టుబడిపై 15 శాతం చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేసుకుంటే 75 లక్షలు అవుతుంది. ఇదే సమయంలో ఇన్వెస్టర్ పెట్టుబడి రూపంలో మెుత్తంగా రూ.27 లక్షలు పడతారు కాబట్టి ఈ రెండింటిని కలిపితే మెుత్తం 15 ఏళ్ల తర్వాత రాబడి రూ.1.02 కోట్లకు చేరుకుంటుంది. అంటే క్రమపద్ధతిలో పెట్టుబడి పెడితే కోటీశ్వరులుగా మారాలనుకునే కల నిజం కావటం తథ్యం అని ఈ ఫార్ములా నిరూపిస్తోంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే వీటిలో నష్టాలను చవిచూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


Click it and Unblock the Notifications