SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుత స్కీమ్.. రోజుకు రూ.20 పెట్టుబడితో రూ.లక్ష సొంతం చేసుకోవచ్చు..!

చాలా మంది డబ్బులు సంపాదిస్తుంటారు. అయితే అందులో చాలా తక్కువ మంది పొదుపు చేస్తుంటారు. మిగతా వారు తమ జీతం ఖర్చులకే సరిపోవడం లేదు.. ఇక పొదుపు ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు. అయితే చిన్న మొత్తంలో కూడా పెట్టుబడి పెట్టి మంచి రాబడి సాధించి పథకాలు ఉన్నాయి. రూజువారి కూలీలైన ఈ పథకాల ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. పేదవారి కోసం ప్రముఖ ప్రభుత్వ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హర్ ఘర్ లఖ్‌పతి పథకం తీసుకొచ్చింది. ఈ పథకంలో చేరి డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. మీరు మీ పిల్లల చదువు కోసం కావొచ్చు, వారి పెళ్లిళ కోసం కావొచ్చు లేదా ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ పొదుపు డబ్బు ఉపయోగపడే అవకాశం ఉంది.

హర్ ఘర్ లఖ్‌పతి అనేది ఎస్బీఐ అందిస్తున్న ప్రత్యేకమైన రికరింగ్ డిపాజిట్ పథకం. చిన్న మొత్తంలో పొదుపు చేసి ప్రతి ఒక్కరూ లక్షాధికారి కావాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు.
హర్ ఘర్ లఖ్‌పతి పథకం కింద 10 సంవత్సరాలు దాటిన పిల్లలు, వయోజనులు కూడా పెట్టుబడి పెట్టొచ్చు. భార్యాభర్తలు కూడా ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. ఈ పథకంలో చేరే దరఖాస్తుదారులకు వడ్డీ రేటు, వారు ఎంచుకునే కాలపరిమితి, వారి వర్గాన్ని బట్టి మారుతుంది. సాధారణ వినియోగదారులకు, 3 నుండి 4 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ పథకంపై 6.55 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. అదేవిధంగా 5 నుంచి 10 సంవత్సరాల RD పథకాన్ని ఎంచుకుంటే 6.30 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నారు.

SBI RD

వయోవృద్ధులు 6.80 శాతం నుంచి 7.05 శాతం వరకు వడ్డీ రేటును పొందవచ్చు. ఇందులో వారు పదవీ విరమణ చేసినా లేదా ఎస్‌బిఐ బ్యాంకులో పనిచేస్తున్నా, వారికి కొంచెం ఎక్కువ వడ్డీ రేటు ఇస్తారు. ఒక వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే హర్ ఘర్ లఖ్‌పతి RD ప్లాన్‌లో నెలకు రూ. 590 నుంచి రూ. 610 వరకు పొదుపు చేస్తున్నారని అనుకుంటే. రోజుకు సుమారుగా రూ. 20 పొదుపు చేస్తే సరిపోతుంది. ఇలానే మీ పట్టుబడి 10 సంవత్సరాల కొనసాగిస్తే.. అప్పుడు మీకు రూ. 1 లక్ష పొందే అవకాశం ఉంటుంది. మీరు 7 సంవత్సరాల RD ప్లాన్‌ను ఎంచుకుని పొదుపు చేస్తే రూ.లక్ష కోసం నెలకు రూ. 850 నుండి రూ. 890 వరకు పొదుపు చేసినా మెచ్యూరిటీ సమయంలో రూ. 1 లక్ష వచ్చే అవకాశం ఉంది.

తక్కువ సంవత్సరాలు పొదుపు చేయాలనుకునే వారు ఐదేళ్ల ఆర్డీ ప్లాన్‌ను కూడా ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఐదేళ్ల ఆర్టీ చేయాలనుకుంటే.. రూ.లక్ష కోసం మీరు నెలకు రూ. 1320 నుంచి రూ. 1360 వరకు పొదుపు చేయాల్సి ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మీకు రూ. 1 లక్ష అవకాశం ఉంది. మీరు 3 సంవత్సరాల ఆర్డీ ప్లాన్‌ను ఎంచుకుంటే లక్ష కోసం నెలకు రూ. 2480 నుండి రూ. 2520 వరకు పొదుపు చేయాల్సి ఉంటుంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+