చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఈక్విటీ ఫండ్స్ కంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌ను ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇందుకు ప్రధాన కారణంగా పన్ను ఆదాతో అదనపు ప్రయోజనం. అన్నింటి కంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌తో కూడిన సాధారణ ఈక్విటీ ఫండ్. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కేటగిరీ సెక్షన్ 80సీకి సంబంధించి అనేక ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే బెట్టర్‌గా ఉంటుందని భావిస్తారు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలి, అదనపు ప్రయోజనంగా పన్ను ఆదా ఉండాలనుకుంటే ఈఎల్ఎస్ఎస్‌ను ఎంచుకోవాలి.

సిప్ లేదా లమ్‌సమ్
మీరు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో పెద్ద మొత్తంలో (ఏకమొత్తం) ఇన్వెస్ట్ చేస్తే, మార్కెట్ ఆ తర్వాత ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. అది నష్టాల్లో ఉండవచ్చు లేదా లాభపడవచ్చు. ఏకమొత్తంలో డబ్బును పెట్టాలనుకుంటే మార్కెట్ రాంగ్ టైమ్‌ను ఎంచుకోవద్దు. అలా అని మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. కాబట్టి ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈఎల్ఎస్ఎస్ సిప్‌ను ఎంచుకోవడం మంచి మార్గం అని మార్కెట్ నిపుణుల సూచన. అది పెద్ద రిస్క్‌కు దూరంగా భావించవచ్చు.
ఇక్కడ మరో విషయం, ఇప్పటికే మనం ఫిబ్రవరిలోకి అడుగు పెట్టాం. FY22 వచ్చే నెలతో పూర్తవుతుంది. ఇలాంటి సమయంలోను మీకు మిగిలి ఉన్న ఒక మార్గం ఏకమొత్తం లేదా ఆ మొత్తాన్ని భాగాలుగా విభజించి, ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కొన్ని వారాల్లో కొనసాగించవచ్చు.

రెండేళ్ల క్రితం ఇన్వెస్ట్ చేస్తే..
భారత మార్కెట్లు 2020 మార్చిలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 35 శాతం నుండి 40 శాతం మేర పతనమయ్యాయి. ఆ సమయంలో అంటే రెండేళ్ల క్రితం ఈఎల్ఎస్ఎస్‌లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే వారి రాబడి ఇప్పుడు చాలా అధికంగా ఉండేది.
అలాగే, ఎవరైనా 2008 జనవరిలో ఈఎల్ఎస్ఎస్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే తదుపరి సంవత్సరం మార్కెట్ భారీగా నష్టపోయినందున, పెద్ద మొత్తం నష్టపోతారు. కాబట్టి మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం.
కానీ సిప్ లేదా లమ్‌సమ్ రెండు రిస్క్‌తో కూడుకున్నవే. అయితే కొన్ని సమయాల్లో లమ్‌సమ్ విధానం మెరుగ్గా పని చేస్తుంది. సిప్ తీరు భిన్నంగా ఉంటుంది.

డెట్ ఫండ్స్ ద్వారా..
సిప్ అంటే పెద్ద మొత్తంలో ఒకేసారి లేనివారికి కూడా ఇది అనుకూలం. మీ వద్ద పెద్ద మొత్తంలో ఉంటే, దానిని ఒకేసారి ఇన్వెస్ట్ చేయవద్దనుకుంటే అన్నింటిని డెట్ ఫండ్స్‌లో పార్క్ చేయాలి. మంత్లీ ఎస్టీపీని ఎంచుకోవాలి. అప్పుడు ప్రతి నెల కొంత మొత్తం ఈఎస్ఎల్ఎల్‌లోకి వెళ్తుంది. పన్ను ఆదా కోసం ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌ను ఎంచుకోవడానికి కొద్ది రోజులే ఉంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఇన్వెస్ట్ చేయాలి.


Click it and Unblock the Notifications