బంగారానికి డిమాండ్ పెరుగుతున్న కారణంగా చాలామంది గోల్డ్ లో ఇన్వెస్ట్ మెంట్స్ చేయడం మొదలుపెడుతున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది డిజిటల్ గోల్డ్ ను కూడా కొనుగోలు చేస్తున్నారు. అయితే డిజిటల్ గోల్డ్ అనేది మిగిలిన గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్స్ తో పోలిస్తే కొంత డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్స్ బాగా పెరుగుతున్నాయి. రకరకాల పేమెంట్ యాప్స్ ఈ తరహా డిజిటల్ గోల్డ్ స్కీమ్స్ ను ఆఫర్ చేస్తున్నాయి. దాంతో చాలామంది వీటిపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. బ్యాంక్‌లు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడిపెట్టడం కంటే ఈజీగా యాప్ ద్వారా డిజిటల్ గోల్డ్ కొనడం బెటర్ అని చాలామంది భావిస్తున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడి పెట్టేముందు వాటిని అర్థం చేసుకోవడం చాలా అవసరం.
డిజిటల్ గోల్డ్ అంటే..
డిజిటల్ గోల్డ్(digital gold) అంటే ఆన్‌లైన్ ద్వారా వర్చువల్‌గా కొనుగోలు చేసే బంగారం. అంటే మీరు ఒక యాప్ లేదా ప్లాట్‌ఫామ్ ద్వారా డబ్బు చెల్లిస్తే వాళ్లు ఆ విలువకు సమానమైన బంగారాన్ని తమ ఖజానాలో మీ పేరుతో నిల్వ చేస్తారు. ఇదీ అసలు ప్రాసెస్. మీరు కోరుకుంటే ఆ బంగారాన్ని అమ్మి డబ్బు తీసుకోవచ్చు లేదా నిజమైన బంగారాన్ని ఇంటికి డెలివరీ చేయించుకోవచ్చు. అయితే ఇదంతా కేవలం ఆయా యాప్స్ అందిస్తున్న సర్వీస్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఇది ఏ ప్రభుత్వ సంస్థ నియంత్రణలో ఉండదు. RBI, SEBI వంటి సంస్థలు డిజిటల్ గోల్డ్‌పై ఎలాంటి నిఘా పెట్టవు. అంటే మీరు పూర్తిగా కంపెనీపై నమ్మకంతో పెట్టుబడి పెట్టాలి.
రిస్క్ ఇదే..
డిజిటల్ గోల్డ్ పై ఎలాంటి నియంత్రణ ఉండదు కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టిన యాప్ లేదా ప్లాట్‌ఫామ్ ఉన్నట్టుండి దివాలా తీస్తే మీ డబ్బు తిరిగి రాకపోవచ్చు. కాబట్టి ఈ రిస్క్ ను కూడా పరిగణలోకి తీసుకుని పెట్టుబడి పెట్టాలి.
ఇక మరో రిస్క్ ఏంటంటే.. డిజిటల్ గోల్డ్‌లో మీరు గమనించని కొన్ని హిడెన్ ఛార్జీలు ఉండొచ్చు. మీ బంగారాన్ని స్టోర్ చేయడం, దానికి ఇన్సూరెన్స్ చేయడం లేదా క్వాలిటీ చెకింగ్ చేయించడం వంటి సర్వీసుల కోసం యాప్ లు మీపై అదనపు ఛార్జీలు వేయొచ్చు. ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివితే తెలుస్తాయి. లేదా బంగారాన్ని తిరిగి అమ్మేటప్పుడు ఈ ఛార్జీలు గమనించొచ్చు.
సేఫ్ ఆప్షన్స్
ఇక సేఫ్ గా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టొచ్చు. డిజిటల్ గోల్డ్ కావాలి అనుకునేవారు పేటియం, ఫోన్ పే వంటి యాప్స్ ను ఆశ్రయించొచ్చు. ప్రస్తుతం చాలామంది ఫోన్ పే, పేటియంలలో డిజిటల్ గోల్డ్ కొంటున్నారు. అయితే ఆ యాప్స్ ను ఎంతవరకూ నమ్మొచ్చు అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. రిస్క్ ఫ్యాక్టర్ తక్కువే అయినా.. పూర్తిగా జీరో మాత్రం కాదు.
More From GoodReturns

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం ధరలు.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

అక్షయ తృతీయ నాడు బంగారం ఇలా కొంటే భారీగా నష్టపోతారు.. కొనుగోలుపై కీలక సూచన చేస్తున్న ఆర్థిక నిపుణులు

నిజాం నవాబుల బంగారం.. హైదరాబాద్ వ్యాపారికి రూ. 50 కోట్లు టోపీ పెట్టిన కేటుగాళ్లు.. అసలు కథ ఏంటంటే..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంతవరకు ఢమాల్ అయిందంటే.. ఏప్రిల్ 17, శుక్రవారం ధరలు ఇవే..

Gold price: బంగారం ధర ఎందుకు నెమ్మదించింది? భారీ పెరుగుదల ఉంటుందా లేక తగ్గుతుందా?

బంగారం ధరలపై దిమ్మతిరిగే న్యూస్.. పసిడి ధర భారీగా పెరగడానికి ఈ మూడే కారణం.. భవిష్యత్తులో కూడా..

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

బంగారాన్ని భారీగా కొంటున్న బ్యాంకులు.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులన్నీ అమ్మేసి మరీ.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు పతనం.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంపై షాకింగ్ న్యూస్.. 10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వ కంటే ఎక్కువే..

Gold: అత్యవసరంగా డబ్బు కావాలా? బంగారంతో ఉన్న 'లిక్విడిటీ' అడ్వాంటేజ్ గురించి మీకు తెలుసా?



Click it and Unblock the Notifications