క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఆ రెండింటి పైనే ఆధారపడుతున్నారా?
ఇటీవల క్రిప్టో కరెన్సీలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మాత్రమే కాదు, భారత్‍లోను క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేస్తున్న రిటైల్ ఇన్వెస్టర్లు వేగంగా పెరుగుతున్నారు. క్రిప్టోలో పెట్టుబడులు అంటే చాలామందికి క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ లేదంటే ఎథేరియం మాత్రమే ఎక్కువగా తెలుసు. వీటిని పక్కన పెడితే అప్పుడప్పుడు హఠాత్తుగా ఎగిసిపడుతున్న డోజీకాయిన్, షిబా ఇను వంటివి కనిపిస్తున్నాయి. బిట్ కాయిన్, ఎథేరియం, షిబా ఇను.. ఇలా కొన్ని క్రిప్టోల్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీటికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉన్నాయా అంటే...

వాటి మార్కెట్ పెరిగింది
క్రిప్టో మార్కెట్‌లో బిట్ కాయిన్, ఎథేరియం వాటా ఎక్కువగా ఉంటుంది. బిట్ కాయిన్ వ్యాల్యూ ప్రస్తుతం 44,000 డాలర్ల స్థాయిలో, ఎథేరియం వ్యాల్యూ 3000 డాలర్లకు పైన ఉంది. క్రిప్టోలో బిట్ కాయిన్ మార్కెట్ వాటా 40 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల క్రిప్టో మార్కెట్ పడిపోయింది. ఓ సమయంలో బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టం 69,000 డాలర్లను తాకింది. దీంతో బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 69 శాతం నుండి 42 శాతానికి తగ్గింది. అదే సమయంలో ఆల్ట్ కాయిన్స్ 11 శాతం నుండి 21 శాతానికి పెరిగాయి.

ఆ రెండుమూడేనా..
17,000 కంటే ఎక్కువగా ఉన్న కాయిన్స్ నుండి కేవలం రెండు, మూడింటిలో మాత్రమే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలా చేస్తే మీ నష్టాన్ని పెంచడం లేదా లాభాలను తగ్గించడం జరగవచ్చు. అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ కింగ్ వారెన్ బఫెట్ ఏం చెబుతారంటే.. వైవిద్యీకరణ ఉండాలని, అది ముఖ్యమని అంటారు. మార్కెట్ నిపుణులు కూడా పెట్టుబడుల విషయానికి సంబంధించి డైవర్సిఫికేషన్ ఉండాలని చెబుతుంటారు. ఒకే అంశంపై ఆధారపడితే నష్టపోవచ్చు లేదా లాభాలు తగ్గవచ్చు. కానీ వివిధ మార్గాలు ఎంచుకుంటే సేఫ్ సైడ్ ఉంటుంది. కాబట్టి బిట్ కాయిన్, ఎథేరియం వంటి వాటిని దాటి ఆలోచించాలి. మీ పోర్ట్ పోలియోలో కొంత భాగాన్ని ఇతర ఆశాజనక క్రిప్టో ఆస్తుల్లో ఉండేలా చూసుకోవాలని అంటున్నారు.

ప్రత్యామ్నాయం సరే.. ఇవి చూడండి
ప్రత్యామ్నాయ క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేయాలి. అయితే పూర్తి అవగాహనతో, నిపుణుల సలహాలతో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ప్రత్యామ్నాయం అంటే కొన్ని అంశాలు అవసరం.
మొదటిది లభ్యత(Availability). అంటే అన్ని ఎక్స్చేంజీల్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? బహుళ బ్లాక్ చైన్స్‌లో ఈ టోకెన్‌కు సపోర్ట్ ఉందా? ఏ సమయంలో అయినా కొనుగోలు/విక్రయం సులభమైనా? అనే అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
రెండోది రోడ్ మ్యాప్ డెవలప్‌మెంట్. దీర్ఘకాలిక పెట్టుబడి కోసం అయితే సదరు క్రిప్టో బలమైన అభివృద్ధి ప్రణాళికతో వెళ్తుందా? చూసుకోవాలి.
వీటితో పాటు పెట్టుబడి సాధ్యతను కూడా చూడాలి.


Click it and Unblock the Notifications