SCSS: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టబడి పెడితే నెలకు రూ.8 వేలు మీ సొంతం..!
చాలా మంది రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బులు ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. అయితే వారు సురక్షితమైన, కచ్చితమైన హామీ ఇచ్చే పథకాల్లోనే పెట్టుబడి పెట్టాలని చూస్తారు. అలాంటి వారికి ఫిక్స్ డ్ డిపాజిట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పథకాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(SCSS) లో వడ్డీ 8.2 శాతం వరకు చెల్లిస్తున్నారు. SCSS అనేది సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకమైన చిన్న పొదుపు పథకం. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఇతర ప్రముఖ బ్యాంకులు అందించే 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల కంటే ఎక్కువ.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ రూల్స్ 2019 ప్రకారం, 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ SCSS ఖాతాను తెరవవచ్చు. 55 ఏళ్లు పైబడిన, 60 ఏళ్లలోపు ఉన్న రిటైర్డ్ సివిల్ ఉద్యోగులు, 50 ఏళ్లు పైబడిన, 60 ఏళ్లలోపు ఉన్న రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులు కూడా ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకం సింగిల్, జాయింట్ ఖాతాలను అనుమతిస్తుంది. దీనర్థం సీనియర్ సిటిజన్లు వారి SCSS ఖాతాలను వ్యక్తిగతంగా లేదా వారి జీవిత భాగస్వాములతో కలిసి తెరవవచ్చు. ఈ పథకంలో భాగంగా ప్రతి త్రైమాసికానికి (మూడు నెలలకు ఒకసారి) దాదాపు రూ.25,000 ఆదాయాన్ని రావాలనుకుంటే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టొచ్చు.

ప్రస్తుతం జూలై-సెప్టెంబర్ 2026 త్రైమాసికానికి SCSS వడ్డీ రేటు సంవత్సరానికి 8.2%గా ఉంది. మీరు SCSS ఖాతాను తెరిచిన తర్వాత, మీ డిపాజిట్‌కు వర్తించే వడ్డీ రేటు ఐదేళ్ల కాలపరిమితి అంతటా స్థిరంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన లెక్కిస్తారు. ఇది మార్చి 31, జూన్ 30, సెప్టెంబర్ 30, డిసెంబర్ 31 తేదీల వరకు జమ అవుతుంది. వరుసగా ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి నెలల్లోని మొదటి పని దినం నాడు చెల్లిస్తారు. దీని అర్థం పెట్టుబడిదారులు ప్రతి సంవత్సరం నాలుగు సార్లు వడ్డీ తీసుకుంటారు. మీకు మూడు నెలలకు ఒక సారి రూ.25 వేలు రావాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలో చూద్దాం.
రూ.12.20 లక్షల పెట్టుబడిపై 8.2% వడ్డీ రేటుతో త్రైమాసికానికి దాదాపు రూ.25,010 ఆదాయం లభిస్తుంది. ఈ పథకం ఐదేళ్ల కాలపరిమితిని కలిగి ఉంది. త్రైమాసిక వడ్డీ చెల్లింపులను అందిస్తుంది. అందువల్ల ఇది స్థిరమైన ఆదాయానికి ప్రాధాన్యత ఇచ్చే పదవీ విరమణ చేసిన వారికి ఒక మంచి ఎంపికగా నిలుస్తుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
