సేవింగ్స్, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలా ప్రజలకి ఎన్నో రకాల పెట్టుబడి ప్లాన్స్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే సురక్షితమైన, నమ్మకమైన పెట్టుబడి అప్షన్ కోసం చూస్తున్నవారు ఎక్కువగా పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) వైపు చూస్తుంటారు. ఈ ప్రభుత్వ పథకం ద్వారా మీ డబ్బును ప్రతినెలా సేవింగ్స్ చేయాలని ఇంకా వాటిని పెంచుకోవాలని కోరుకునే వారికి తక్కువ-రిస్క్ అందిస్తుంది. హామీతో మీ మొత్తం ఇంకా ప్రభుత్వ భద్రతతో పెట్టుబడిదారులకు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒక బెస్ట్ అప్షన్.
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) అంటే ఏమిటి?
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అనేది భారతీయ పోస్టల్ సర్వీస్ అందించే చిన్న పొదుపు పథకం, దీని ద్వారా ఎవరైనా ప్రతి నెల నెల కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టవచ్చు. ఈ నెల నెల డిపాజిట్లు మంచి వడ్డీ రేటుతో ఇంకా మీ పెట్టుబడి కాలం ముగిసేలోపు పెట్టుబడిదారులకి మంచి మొత్తం తిరిగి అందిస్తుంది. ప్రతినెలా సేవింగ్స్ అలవాట్లను ప్రోత్సహించడానికి, డబ్బు పెంచుకోవడానికి ఈ పథకం తీసుకొచ్చారు.

ఇక పోస్ట్ ఆఫీస్ RDపై ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 6.5%, ఇతర తక్కువ-రిస్క్ పెట్టుబడి అప్షన్ తో పోలిస్తే చాల దగ్గర ఉంటుంది. పెట్టుబడిదారులు నెలకు కనీసం రూ. 100తో ఈ స్కిం ప్రారంభించవచ్చు అలాగే మీ పెట్టుబడికి లిమిట్ లేదు. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5-సంవత్సరాలు. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పెట్టుబడిదారులకి జమ చేసిన మొత్తం వడ్డీతో తిలిగి చెల్లిస్తారు.
పోస్ట్ ఆఫీస్ RD బెనిఫిట్స్ చూస్తే పెట్టుబడికి లిమిట్ లేదు కాబట్టి కావలసినంత పెట్టుబడి పెట్టవచ్చు. పోస్ట్ ఆఫీస్ RD కాలిక్యులేటర్‌ని ఉపయోగించి ఒక వ్యక్తి 6.7% వడ్డీ రేటుతో ఈ పథకంలో ప్రతినెలా రూ. 5,000 పెట్టుబడి పెట్టాడని అనుకుందాం. 5 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి రూ. 3,00,000 అవుతుంది. 5-సంవత్సరాలు ముగిసే సమయానికి పెట్టుబడి రూ. 3,54,945కి పెరుగుతుంది అంటే మీకు మీ మొత్తం పెట్టుబడి పై రూ. 54,957 వడ్డీ లభిస్తుంది.
పోస్టాఫీసు RD అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలంటే ?
పోస్ట్ ఆఫీస్ RD అకౌంట్ ఓపెన్ చేయడం చాలా ఈజీ. ఈ స్కిం అందించే భారతదేశంలోని ఏ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్‌లోనైనా ఓపెన్ చేయవచ్చు. అకౌంట్ తెరవడానికి అకౌంట్ ఓపెనింగ్ ఫార్మ్ నింపాలి తర్వాత మీరు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్‌తో సహా అవసరమైన డాకుమెంట్స్ ఇవ్వాలి. అకౌంట్ యాక్టివేట్ చేయడానికి ముందుగా కనీస మొత్తం రూ. 100 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీ అకౌంట్ ఓపెన్ చేసాక మీరు మీ ప్రతినెలా సేవింగ్స్ మొత్తం డిపాజిట్ చేసుకోచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications