లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఇన్వెస్టర్లకు ఎన్నో రకాల ఆకర్షణీయ, సురక్షిత పథకాలను అందిస్తోంది. ఇందులో న్యూ చిల్ట్రన్ మనీ బ్యాక్ పాలసీ ఒకటి. ఈ ఎల్ఐసీ ప్లాన్‌లో పెట్టుబడిదారులు తమ పిల్లల చదువులు లేదా వివాహం కోసం సురక్షిత పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పాలసీలో పెట్టుబడి ద్వారా మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించవచ్చు. ఎల్ఐసీ చిల్ట్రన్ మనీ బ్యాక్ పాలసీలో రోజుకు రూ.150 ఇన్వెస్ట్ చేయడం ద్వారా లక్షల రూపాయలను ఆదా చేయవచ్చు.

కొత్త చిల్ట్రన్ మనీ బ్యాక్ పాలసీ
కొత్త చిల్ట్రన్ మనీ బ్యాక్ పాలసీ ఇరవై అయిదేళ్ల మెచ్యూరిటీ వ్యవధితో వస్తోంది. మీ మెచ్యూరిటీ మొత్తాన్ని మీరు వాయిదాలలో కూడా తీసుకోవచ్చు. మీ బిడ్డకు 18 ఏళ్లు నిండిన తర్వాత నుండి మీ వాయిదాలను స్వీకరించవచ్చు. కూతురుకు 20 ఏళ్లు వచ్చినప్పుడు రెండోసారి, 25 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి మొత్తం లబ్ధిదారుడి ఖాతాలో జమ అవుతుంది. ఆ సమయంలో లబ్దిదారుకు బోనస్‌తో పాటు 40 శాతం పొందుతాడు. బీమా మొత్తం హామీ ప్రయోజనాలను అందిస్తుంది. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ పథకంలో మీరు ఏడాదికి రూ.55,000, అంటే రోజుకు దాదాపు రూ.150 ఇన్వెస్ట్ చేయాలి. 25 ఏళ్లలో మీరు మొత్తం రూ.14 లక్షలు డిపాజిట్ చేస్తారు. మెచ్యూరిటీ తర్వాత మీకు అదనంగా రూ.19 లక్షలు చేతికి వస్తుంది.

అర్హత
కొత్త చిల్ట్రన్ మనీ బ్యాక్ పాలసీలో చేరడానికి కూతురు వయస్సు జీరో నుండి 12 సంవత్సరాలు. మెచ్యూరిటీ సమయంలో ఇన్వెస్టర్ 60 శాతం కార్పస్, 40 శాతం బోనస్ తీసుకుంటారు. ఈ స్కీమ్ మినిమం సమ్ అస్యూర్డ్ రూ.1 లక్ష. గరిష్ట పరిమితి లేదు. ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో లేదా ఒకేసారి మొత్తం చెల్లించవచ్చు.

ప్రమాదం జరిగితే..
ఈ పాలసీలో రోజుకు రూ.150 అంటే నెలకు రూ.4500 అవుతాయి. ఇలా 22 సంవత్సరాలు చెల్లించాలి. ఈ పాలసీ కోసం ఆధార్ కార్డు, ఆదాయ సర్టిఫికెట్, ఐడెంటిటీ కార్డు, అడ్రస్ ప్రూఫ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, కూతురు బర్త్ డే సర్టిఫికెట్ అవసరం. ఇన్సూర్డ్ పర్సన్ చనిపోతే రూ.5 లక్షలు వస్తాయి. యాక్సిడెంట్ అయితే కుటుంబానికి రూ.10 లక్షలు వస్తాయి.


Click it and Unblock the Notifications