For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రెండింట్లో పెట్టుబడి పెడితే..: 16% నుండి 25% అధిక రాబడి

|

కరోనా నుండి ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది. నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టానికి అడుగు దూరంలో ఉంది. సెన్సెక్స్ కూడా 53,000 పాయింట్లకు సమీపంలో ఉంది. కరోనా నేపథ్యంలో ఇటీవల చాలామంది పెట్టుబడుల పైన, ప్రధానంగా బంగారం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ICICI డైరెక్ట్ రెండు స్టాక్స్ కొనుగోలును సూచిస్తోంది. ఇందులో హిందూస్తాన్ యూనీలీవర్, సింజీన్ ఇంటర్నేషనల్. ఏడాది నుండి రెండేళ్ల కాలపరిమితికి ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చునని చెబుతోంది.

సింజీన్ ఇంటర్నేషనల్

సింజీన్ ఇంటర్నేషనల్

సింజీన్ స్టాక్‌ను రూ.780 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చునని ఐసీఐసీఐ డైరెక్ట్ సూచిస్తోంది. క్రితం సెషన్‌లో ఈ స్టాక్ రూ.626 వద్ద ట్రేడ్ ట్రేడ్ అయింది. ఈ ధరతో టార్గెట్ ధర 25 శాతం ఎక్కువ. ఈ కంపెనీ ఆవిష్కరణల నుండి కమర్షియల్ సరఫరా వరకు సమగ్ర సైంటిఫిక్ సేవలను అందిస్తోంది. భారత అతిపెద్ద కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(CRO)లలో ఇది ఒకటి.

రెవెన్యూ బ్రేక్-అప్: డిస్కవరీ సేవల ద్వారా 35 శాతం, డెడికేటెడ్ సర్వీసెస్ ద్వారా 32 శాతం, డెవలప్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుండి 33 శాతం రాబడి ఉంది.

FY22 మొదటి త్రైమాసికం ఫలితాల విషయానికి వస్తే ఏడాది ప్రాతిపదికన 41 శాతం పెరిగి రూ.658.5 కోట్లకు చేరుకుంది. ఎబిడా మార్జిన్స్ ఏడాది ప్రాతిపదికన 27.8 శాతం తగ్గింది.

ఈ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.26112 కోట్లు, FY21 మొత్తం రుణాలు రూ.893 కోట్లు, క్యాష్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.643కోట్లు, ఈ స్టాక్ 52 వారాల గరిష్టం రూ.700, కనిష్టం రూ.408. టార్గెట్ ధర రూ.780.

హిందూస్తాన్ యూనీలీవర్

హిందూస్తాన్ యూనీలీవర్

FY22 మొదటి త్రైమాసికంలో హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మంచి ఫలితాలు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.2358 వద్ద ఉంది. టార్గెట్ ధరను 16.62 శాతం పెంచి, రూ.2750గా పేర్కొంది. హిందూస్తాన్ యూనీలీవర్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ. దాదాపు నలభై బ్రాండ్స్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ వాష్, పర్సనల్ వాష్, కాస్మోటిక్స్, షాంపూలు వంటివి ఉన్నాయి.

FY22 మొదటి త్రైమాసికంలో సేల్స్ 12.8 శాతం పెరిగాయి. HUL టార్గెట్ ధరను రూ.2750గా పేర్కొంది.

హిందూస్తాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.561036 కోట్లుగా ఉంది. మొత్తం రుణాలు సున్నా. క్యాష్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ రూ.7004 కోట్లు. 52 వారాల రిష్టం రూ.2533, కనిష్టం రూ.2000.

డిస్క్‌క్లెయిమర్

డిస్క్‌క్లెయిమర్

స్టాక్స్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. కాబట్టి పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్లు ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. కరోనా డెల్టా వేరియంట్ వంటి అంశాల ప్రభావం ఉంటుంది. కాబట్టి సూచీలు ఎప్పుడైనా పతనం కావొచ్చు. ఎప్పుడైనా భారీగా పుంజుకోవచ్చు. కాబట్టి అన్నింటిని పరిగణలోకి తీసుకొని, నిపుణుల సలహాల మేరకు పెట్టుబడులు పెట్టాలి.

English summary

ఈ రెండింట్లో పెట్టుబడి పెడితే..: 16% నుండి 25% అధిక రాబడి | Invest in these two stocks to get high returns

Nifty is still 0.66% percent away from life time highs after recovery in the global markets has provided a boost to the Indian markets. And amid all such market news, ICICI Direct has suggested a buy on 2 scrips namely Syngene International and HUL for holding for 1 and 2 years.
Story first published: Sunday, July 25, 2021, 12:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X