స్టాక్ మార్కెట్ భారీ కరెక్షన్‌కు గురైనప్పుడు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలి. డిప్ సమయంలో ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తుంటారు. కరోనా సమయంలో చాలామంది స్టాక్ మార్కెట్ పెట్టుబడుల వైపు చూశారు. 2020 మార్చి చివరి వారంలో సూచీలు భారీగా పతనమయ్యాయి. ఆ సమయంలో ఇన్వెస్ట్ చేసిన వారు ఇప్పుడు వందల రెట్ల రిటర్న్స్ పొందారు. కరోనా తర్వాత ఎక్కువమంది ఇన్సురెన్స్, పెట్టుబడులు, సేవింగ్స్ వైపు చూస్తున్నారు. భవిష్యత్తు కోసం పెట్టుబడులు చాలా నిర్ణయాత్మకంగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే...
మొదటిసారి పెట్టుబడిదారుడు ఎవరైనా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసి, నష్టపోతే నిరుత్సాహపడటం ఖాయం. కాబట్టి మొదటిసారి ఇన్వెస్ట్ చేసే సమయంలో స్టాక్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, స్టాక్ హిస్టరీని పూర్తిగా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయాలి. నిపుణుల సలహాలు తీసుకోవాలి. పెట్టుబడుల లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళిక, క్రమశిక్షణ ముఖ్యం. అప్పుడు కొన్నేళ్లకు మీ చేతికి పెద్ద మొత్తం వస్తుంది.

అప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చు
ఎవరైనా మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పటికీ, మార్కెట్ ఒడిదుడుకులకు భయపడి వేచి చూస్తారు. కానీ దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే కాస్త డిప్ ఉన్న సమయంలోను పెట్టుబడి పెట్టవచ్చు. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి, అసౌకర్యానికి గురైతే పెట్టుబడులను ఈక్విటీ, స్థిర ఆదాయ పెట్టుబడులుగా విభజించవచ్చు. మార్కెట్లు స్థిరీకరించడం ప్రారంభించినప్పుడు క్రమపద్ధతిలో ఈక్విటీలోకి మారడానికి ప్రణాళిక ఉండాలి.

ఇది గుర్తు పెట్టుకోండి
మీ పెట్టుబడి పోర్ట్‌పోలియోలో స్టాక్స్ విలువైన భాగం కావొచ్చు. వివిధ స్టాక్స్‌ను కలిగి ఉండటం ద్వారా మీ సేవింగ్స్‌ను పెంచుకోవడంలో, ద్రవ్యోల్భణం, పన్నుల నుండి మీ డబ్బును రక్షించుకోవడంలో, మీ పెట్టుబడుల నుండి వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడంలో మీకు సహాయపడుతుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు నష్టాలు ఉంటాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్‌లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్‌లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

Stock market: ఇన్వెస్టర్ల కొంప ముంచిన మార్కెట్! ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలివే!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications