ధనవంతులు కావాలనే ఆశ అందరికీ ఉంటుంది. బ్యాంకు ఖాతాలో లక్షల రూపాయలు ఉండాలని కోరుకునే వారు ఉంటారు. అయితే మధ్య తరగతి వ్యక్తికి బ్యాంకులో కనీస మొత్తం ఉండటమే కష్టం. వచ్చే పరిమిత సంపాదన ఖర్చులకు సరిపోతుంది. పరిమిత ఆదాయం, ఎక్కువ ఖర్చుల కారణంగా పొదుపు చేయడం కూడా కష్టమే. అయితే రోజువారీగా కొద్ది మొత్తం పెట్టుబడితో మీరు లక్షాధికారి కావొచ్చు! మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ పెట్టుబడి ద్వారా మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఇందుకు రోజుకు కేవలం రూ.20 ఆదా చేయాలి. మీ రిటైర్మెంట్ సమయానికి ఇది మిమ్మల్ని కోటీశ్వరులను చేయవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్‌తో మంచి రిటర్న్స్
ప్రత్యేక సేవింగ్స్ అకౌంట్‌లో రోజుకు రూ.20 ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు కోటీశ్వరులు కావొచ్చు. అయితే దీనికి తగిన పెట్టుబడి ప్రణాళిక అవసరం. కేవలం రోజుకు రూ.20 ఆదా చేస్తే మీరు మిలియనీర్‌గా ఎలా మారవచ్చునో చూద్దాం..
సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ అందరికి తెలిసిందే. సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. దీని ద్వారా కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేయవచ్చు. గత పాతిక సంవత్సరాలలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు మంచి రిటర్న్స్ వచ్చాయి.

కోటీశ్వరులు కావొచ్చు
రోజుకు రూ.20 ఇన్వెస్ట్ చేస్తే, నెలకు రూ.600 అవుతుంది. ఈ మొత్తాన్ని సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, మంచి రాబడి ఉండే అవకాశముంది. ఇలా 40 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే మొత్తం 480 నెలలు అవుతుంది. ఇది ఏడాదికి 15 శాతం చొప్పున రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. నెలకు రూ.600 చొప్పున 40 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే, ఆ మొత్తం రూ.2.88 లక్షలు అవుతుంది. మీరు ఈ కనీస మొత్తం ఇన్వెస్ట్ చేస్తే నాలుగు దశాబ్దాల్లో రూ.1.88 కోట్లు మీ చేతికి రావొచ్చు. ఒకవేళ సిప్ పైన 20 శాతం రాబడిని అంచనా వేస్తే నలభై ఏళ్ల తర్వాత ఈ మొత్తం రూ.10.21 కోట్లు సమకూరే అవకాశముంది.

రూ.1.07 కోట్లు
ఇరవై ఏళ్ల వయస్సులో ప్రతి రోజు రూ.30 ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే, నెలకు రూ.900 అవుతుంది. మీరు సిప్ ద్వారా డైవర్సిఫైడ్ మ్యూచువల్ పండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే నలభై ఏళ్లకు 12 శాతం వార్షిక రాబడితో రూ.1.07 కోట్లు అందుకుంటారు. ఈ సమయంలో మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ.4,32,000 పెట్టుబడి అవుతుంది. వాస్తవానికి చక్రవడ్డీ, స్వల్ప మొత్తంలో పెట్టుబడులు దీర్ఘకాలంలో పెద్ద నగదుగా మారుతాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ రిస్క్‌తో కూడిన వ్యవహారం. పూర్తి అవగాహనతో ఇన్వెస్ట్ చేయాలి.
More From GoodReturns

Financial planning: ఉద్యోగం ఊడినా, ఖర్చులు పెరిగినా టెన్షన్ పడకుండా ఉండాలంటే ఇలా చేయండి!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications