ఈ రోజు నవంబర్ 19. దీన్ని అంతర్జాతీయ పురుషుల దినోత్సవంగా (International Men's Day) జరుపుకుంటారు. ఉరుకుల పరుగుల జీవితంలో పడి మగవాళ్లు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మర్చిపోతుంటారు. ఆర్థిక జీవితంలో ఎలాంటి ఒత్తిడి ఉండకూడదంటే.. మగవాళ్లు కచ్చితంగా ఈ 5 ముఖ్యమైన చిట్కాలను పాటించాలి. అవేంటంటే..

1.ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్
చాలా కుటుంబాల్లో కుటుంబ పోషణ బాధ్యత పురుషులపైనే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వారికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే, కుటుంబానికి ఆర్థికంగా కష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి మగవాడు టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి కచ్చితంగా తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ (Term Insurance) అనేది మీ వార్షిక ఆదాయం కంటే కనీసం 10 నుంచి 15 రెట్లు ఎక్కువ కవరేజ్ ఇచ్చేదిగా ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ (Health Insurance) విషయంలో మీ కుటుంబంతో సహా అందరికీ సరిపడా ఆరోగ్య బీమా ఉండాలి. దీనివల్ల వైద్య ఖర్చులు మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయకుండా ఉంటాయి.
2. ఎమర్జెన్సీ ఫండ్
కుటుంబ బాధ్యతలు ఉండే మగవాళ్లు తప్పకుండా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా ఉద్యోగం కోల్పోవడం, ఆరోగ్య సమస్యలు లేదా ఇతర ఖర్చులు ఎదురైనప్పుడు ఆర్థికంగా తట్టుకోవడానికి ఈ ఫండ్ పనికొస్తుంది. సుమారు 6 నుంచి 12 నెలల వరకూ ఇల్లు గడిచేలా సరిపడా డబ్బుని ఒక సురక్షితమైన బ్యాంక్ అకౌంట్ లో లేదా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టాలి. మరే ఇతర అవసరాలకు ఈ ఫండ్ ను వాడకూడదు.
3. లక్ష్యాలను మర్చిపోవద్దు
ప్రతి మగవాడికి ఆర్థికంగా ఏదో ఒక గోల్ ఉంటుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. మీ మీ లక్ష్యాల ఆధారంగా పెట్టుబడి పెట్టాలి. కారు లేదా ఇల్లు వంటి లక్ష్యాల కోసం 30 ఏళ్ల నుంచే పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. దీనికోసం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడి మార్గాలను ఎంచుకోవచ్చు.
4. అప్పులు తగ్గించుకోండి
అప్పులు మగవారిని మానసికంగా కుంగదీస్తాయి. అందుకే వీటికి వీలైనంత వరకూ దూరంగా ఉండడం మంచిది. చిన్న చిన్న ఖర్చుల కోసం క్రెడిట్ కార్డులు వంటివి వాడినా పర్లేదు. కానీ, ఎక్కువ వడ్డీతో భారీ అప్పులు తీసుకోకుండా జాగ్రత్తపడాలి. అలాగే ఆదాయాన్ని మించిన అప్పులు లేకుండా చూసుకోవాలి.
5. డిసిప్లైన్ వదలొద్దు
చాలామంది మగవాళ్లుఫైనాన్షియల్ గా డిసిప్లైన్ పాటించాలని గట్టిగా అనుకుంటారు. కానీ, కొన్ని రోజులకే దాన్ని వదిలేస్తారు. దీనివల్ల మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. కాబట్టి మీ ప్లానింగ్ ను కనీసం ఆరు నెలలకోసారి సమీక్షించుకోవాలి. అవసరమైనప్పుడు అందులో మార్పులు చేసుకోవాలి.
ఇది మర్చిపోవద్దు
కుటుంబ బాధ్యతలు మోసే మగవారు కచ్చితంగా ఈ 5 రూల్స్ ను తప్పక పాటించాలి. కుటుంబం కోసం మీరు తీసుకునే బాధ్యత చాలా గొప్పది. అయితే ఆర్థికంగా బలంగా ఉంటేనే మీరు జీవితంలో మరింత ధైర్యంగా ముందుకు వెళ్లగలరు. కాబట్టి, ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా మీ ఆర్థిక జీవితాన్ని బలంగా తీర్చిదిద్దుకోండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications