For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్టుబడికి అంతర్జాతీయ ఫండ్స్ ఓపెన్, ఈ నాలుగు చూడండి..

|

రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. ఆర్బీఐ విదేశీ పరిమితుల నేపథ్యంలో అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్స్ ఫండ్స్ స్వీకరించడం ఆపివేసిన తర్వాత, మరోవైపు తాజా మార్కెట్ దిద్దుబాటు మధ్య గ్లోబల్ మార్కెట్‌లకు తమ కేటాయింపులను పెంచుకోవాలని చూస్తున్న పెట్టుబడిదారులకు అపరిమిత ఎంపికలు లేవు. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు ప్రపంచ స్టాక్ ధరలను దెబ్బతీసింది. అయితే విదేశీ పెట్టుబడి పరిమితుల కారణంగా చాలా అంతర్జాతీయ నిధులు తాజా ఇన్వెస్టర్స్ ఫ్లోను యాక్సెప్ట్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో పెట్టుబడికి అవకాశమున్న నాలుగు ఇంటర్నేషనల్ ఫండ్స్‌ను చూద్దాం...

ఈటీఎఫ్

ఈటీఎఫ్

- అంతర్జాతీయ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ETFs)లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఓవర్సీస్ లిమిట్ ఓపెన్‌గా ఉంది. కొటక్ నాస్‌డాక్ 100 ఫండ్ ఆఫ్ ఫండ్... ఐషేర్స్ నాస్‌డాక్ 100 UCITS ETFలో ఇన్వెస్ట్ చేసింది. నాస్‌డాక్ 100 అనేది స్టాక్ ఎక్స్చేంజీలో జాబితా చేయబడిన 100 అమెరికా కంపెనీ సూచిక.

- డీఎస్‌పీ గ్లోబల్ ఇన్నోవేషన్ ఫండ్ ఆఫ్ ఫండ్‌ను ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ కలయికలో పెట్టుబడి ఆలోచనతో ప్రారంభించబడింది. విదేశీ పరిమితులపై సెబి ఆదేశాలను అనుసరించి ప్రస్తుతానికి ఫండ్ ఐషేర్స్ నాస్‌డాక్ 100 UCITS ETF, ఐషేర్ సెమీకండక్టర్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెడుతుంది.

వాన్ గార్డ్

వాన్ గార్డ్

సచిన్ బన్సాల్‌కు చెందిన నావీ మ్యూచువల్ ఫండ్స్ యూఎస్ టోటల్ స్టాక్ మార్కెట్ ఫండ్ ఆఫ్ ఫండ్ వాన్‌‌గార్డ్ నిర్వహిస్తున్న ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెడుతుంది. వాన్ గార్డ్ టోటల్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ ఈటీఎఫ్ (VTI ETF) CRSP US టోటల్ మార్కెట్ ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తుంది. ఇది యూఎస్ ఈక్విటీ మార్కెట్‌ను దాదాపు అన్నింటిని కవర్ చేసే విస్తృత యూఎస్ ఇండెక్స్. ఇది బహూళ రంగాలలో, 4000 కంటే ఎక్కువ స్టాక్స్‌ను కలిగి ఉంది. వీటీఐ ఈటీఎఫ్ 1.3 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులతో ప్రపంచంలోనే మూడో అతిపెద్దది.

ఆదిత్య బిర్లా సన్ లైఫ్

ఆదిత్య బిర్లా సన్ లైఫ్

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నాస్‌డాక్ 100 ఫండ్ ఆఫ్ ఫండ్ కూడా ఐషేర్స్ నాస్‌డాక్ 100 UCITS ETFలో పెట్టుబడి పెడుతుంది. నాస్‌డాక్ 100 అనేది నాస్‌డాక్ స్టాక్ ఎక్స్చేంజీలో జాబితా చేయబడిన 100 అతిపెద్ద యూఎస్ కంపెనీల సూచి

English summary

పెట్టుబడికి అంతర్జాతీయ ఫండ్స్ ఓపెన్, ఈ నాలుగు చూడండి.. | International funds that are still open for investment

The Russia-Ukraine crisis has sent the global stock markets into a meltdown. However, investors looking to increase their allocation to global markets amidst the ongoing correction don't have many options as most international mutual funds stopped accepting fresh money after RBI's overseas limits were set to be breached.
Story first published: Tuesday, March 1, 2022, 14:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X