For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

festival offer: హోమ్ లోన్ తీసుకుంటే అదిరిపోయే న్యూస్, అన్ని బ్యాంకులదీ అదే దారి

|

ప్రయివేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం HDFC తన కస్టమర్లకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న పండుగ సీజన్‌లో పరిమిత కాలంలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్ల కింద కస్టమర్లు HDFC బ్యాంకు నుండి హోమ్ లోన్ కూడా తక్కువ వడ్డీ రేటుకు తీసుకోవచ్చును. ఈ ఫెస్టివెల్ సీజన్ పరిమిత కాలం ఆఫర్లను బ్యాంకు నిన్నటి నుండే ప్రారంభించింది. హోమ్ లోన్ వడ్డీ రేట్లు 6.70 శాతం నుండి ప్రారంభమవుతున్నాయని, ఇది 20 సెప్టెంబర్ 2021 (సోమవారం) నుండి అమలులోకి వచ్చిందని బ్యాంకు ప్రకటించింది. ఈ ఆపర్ ప్రతి కొత్త కస్టమర్‌కు వర్తిస్తుందని తెలిపింది. లోన్ అమౌంట్, ఎంప్లాయిమెంట్ కేటగిరీతో సంబంధం లేకుండా అందరికీ ఈ ఆఫర్‌ను వర్తింప చేస్తున్నట్లు పేర్కొంది. రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ స్కీం 40 రోజుల పాటు ఉంటుంది. 20 సెప్టెంబర్ తేదీన ప్రారంభమైన ఈ పరిమిత కాల స్కీం అక్టోబర్ 31 తేదీన ముగియనుంది.

పండుగ సీజన్‌లో కొత్త ఉత్సాహం

'రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని తమ కస్టమర్లకు ప్రత్యేక హోమ్ లోన్ వడ్డీ రేట్లను ప్రకటించామని, ఇందుకు సంతోషంగా ఉంది. ఇంటిని కొనుగోలు చేయాలని భావించేవారికి పండుగ సమయంలో ఈ తగ్గింపు వడ్డీ రేటు ఉత్సాహాన్ని ఇస్తుందని మేం భావిస్తున్నాం. హౌసింగ్ లోన్ వడ్డీ రేటు గతంలో కంటే ఇప్పుడు చాలా తగ్గింది. గత రెండేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ప్రాపర్టీ ధరల్లో మార్పులు కనిపించాయి. తక్కువ వడ్డీ రేట్లు, PMAY సబ్సిడీ, ఇతర పన్ను ప్రయోజనాలు వంటివి రుణాలు పెరగడానికి దోహదపడ్డాయి' అని HDFC లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రేను సూద్ కర్నాడ్ తెలిపారు. HDFC బ్యాంకు వెబ్ సైట్ ప్రకారం ప్రస్తుతం వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. ఇప్పటికే వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేటు తక్కువగా ఉంది.

Interest rate cuts by leading banks: HDFC cuts home loan rates

ఈ బ్యాంకులు తగ్గించాయి

పలు బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను తగ్గించాయి. గతవారం ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), ప్రయివేటురంగ బ్యాంకు కొటక్ మహీంద్రా హోమ్ లోన్ పైన ఆఫర్లు ప్రకటించాయి. ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటు 6.70 నుండి ప్రారంభమవుతోంది. పండుగ సీజన్ నేపథ్యంలో జీరో ప్రాసెసింగ్ ఫీజు ఆఫర్ ఇచ్చింది ఎస్బీఐ.
బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించింది. ఈ బ్యాంకు వడ్డీ రేటు 6.75 శాతం నుండి ప్రారంభమవుతోంది. కారు లోన్ వడ్డీ రేటు 7 శాతం నుండి ప్రారంభమవుతోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటు (రెపో ఆధారిత వడ్డీ రేటు) 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.55 శాతం నుండి ప్రారంభమవుతుంది.

కొటక్ మహీంద్రా బ్యాంకు తగ్గింపు

కొటక్ మహీంద్రా బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. తగ్గించిన వడ్డీ రేట్లు సెప్టెంబర్ 10(శుక్రవారం) నుండి అమలులోకి వచ్చాయి. హోమ్ లోన్ వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. తాజా తగ్గింపుతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇప్పుడు 6.50 శాతం నుండి ప్రారంభమవుతాయి. జూలై నెల డేటా ప్రకారం ఇప్పటికే వివిధ బ్యాంకులతో పోలిస్తే కొటక్ మహీంద్రా బ్యాంకు అతి తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్స్‌ను అందిస్తోంది. దాదాపు 16 బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు రూ.75 లక్షలకు మించిన హోమ్ లోన్స్ పైన వడ్డీ రేటును ఏడు శాతంతో అందిస్తున్నాయి. ప్రయివేటు రంగ బ్యాంకుల విషయానికి వస్తే కొటక్ మహీంద్రా బ్యాంకు, ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకులు తక్కువ హోమ్ లోన్ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. వీటిలో వడ్డీ రేటు 6.65 శాతంగా ఉంది. ప్రభుత్వ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), ప్రయివేటురంగ దిగ్గజం HDFCలలో రూ.75 లక్షలకు మించిన హోమ్ లోన్ పైన వడ్డీ రేటు 6.95 శాతంగా ఉంది.

Interest rate cuts by leading banks: HDFC cuts home loan rates

ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటు

అంతకుముందు ఎస్బీఐ ఇటీవలే అద్భుతమైన హోమ్ లోన్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. మాన్‌సూన్ ధమాకా ఆఫర్‌లో భాగంగా హోమ్ లోన్ పైన ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. పండుగ సీజన్ నేపథ్యంలో క్రెడిట్ స్కోర్ లింక్డ్ హోమ్ లోన్స్‌ను తక్కువ ధరకే అందిస్తోంది. ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటును 6.7 శాతానికి ఇస్తున్నట్లు ప్రకటించింది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. అలాగే, ఆఫర్ కింద ప్రాసెసింగ్ ఫీజును కూడా తొలగించినట్లు బ్యాంకు ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు రూ.75 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో హోమ్ లోన్ తీసుకునేవారు 7.15 శాతం వడ్డీరేట్లు చెల్లించాలి. అయితే ఈ పండగ ఆఫర్‌తో కొత్తగా హోమ్ లోన్ తీసుకునేవారికి ఎంత మొత్తం రుణానికైనా 6.70 వడ్డీరేటు ఉంటుందని బ్యాంకు వెల్లడించింది. దీంతో 30 ఏళ్ల కాలవ్యవధితో రూ.75 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో రుణం తీసుకునే వారికి వడ్డీ భారం 45 బేసిస్ పాయింట్ల తగ్గడంతో పాటు రూ.8 లక్షలు ఆదా అవుతుందని తెలిపింది.

English summary

festival offer: హోమ్ లోన్ తీసుకుంటే అదిరిపోయే న్యూస్, అన్ని బ్యాంకులదీ అదే దారి | Interest rate cuts by leading banks: HDFC cuts home loan rates

India’s premier housing finance company HDFC today unveiled its special limited period offer for the upcoming festival season.
Story first published: Tuesday, September 21, 2021, 12:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X