ఇన్ఫోసిస్, HDFC సహా ఈ స్టాక్స్ మీకు మంచి రిటర్న్స్ ఇవ్వొచ్చు!
కరోనా మహమ్మారి సమయంలోను పలు స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్, ప్రయివేటురంగ బ్యాంకు HDFC సహా పలు కంపెనీలు మంచి రిటర్న్స్ అందించాయి. కరోనా సెకండ్ వేవ్ ఆందోళనలతో సూచీలు నేడు మరోసారి పతనమయ్యాయి. ప్రస్తుతం అందరి దృష్టి కార్పోరేట్ ఆదాయాలపై ఉంది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాల ప్రభావం ఆయా రంగాలు, ఆయా కంపెనీల స్టాక్స్ పైన ప్రభావం చూపుతాయి. గత కొంతకాలంలోను కొన్ని స్టాక్స్ భారీగా ఎగిశాయి.

మరింత పెరగొచ్చు
ఆల్కెమ్ ల్యాబ్స్ స్టాక్స్ ఇటీవల రూ.2799 గరిష్టాన్ని తాకింది. దీని టార్గెట్ ధర రూ.3150 వద్ద అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు. నేడు ఈ స్టాక్ రూ.2757 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు 2.66 శాతం క్షీణించింది. రూ.2700 స్టాప్ లాస్ పెట్టుకొని రూ.2800 నుండి రూ.2860 మధ్య కొనుగోలు చేయవచ్చునని, రూ.3150 టార్గెట్ ధర అని అంచనా వేస్తున్నారు.
ఇంద్రప్రస్త గ్యాస్ ధర నేడు రూ.515.90 వద్ద క్లోజ్ అయింది. నేడు ఈ స్టాక్ దాదాపు 5 శాతం మేర క్షీణించింది. సమీప కాలంలో ఈ స్టాక్ రూ.610కి చేరుకోవచ్చునని, రూ.530-545 మధ్య కొనుగోలు చేయవచ్చునని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. స్టాప్ లాస్ రూ.510గా రికమెండ్ చేస్తున్నారు.

HDFC, ఇన్ఫోసిస్ టార్గెట్ ధర
HDFC షేర్ ఇటీవల రూ.2896 ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఇటీవల క్షీణించింది. నేడు రూ.2426 స్థాయికి చేరుకుంది. టార్గెట్ ధర రూ.2690గా భావిస్తున్నారు.
ఇన్ఫోసిస్ స్టాక్ స్టాక్ నేడు స్వల్పంగా (0.66 శాతం) క్షీణించి రూ.1431.50 వద్ద క్లోజ్ అయింది. అయితే ఇటీవలి కాలంలో ఈ స్టాక్ భారీగా జంప్ చేసింది. గత కొంతకాలంగా రూ.1350-1450 మధ్య ట్రేడ్ అవుతోంది. టార్గెట్ ధర రూ.1540.

టెక్ మహీంద్రా...
టోరెంట్ పవర్ స్టాక్ టార్గెట్ ధర రూ.450. ఇది గత కొంతకాలంగా రూ.400 నుండి రూ.425 మధ్య ట్రేడ్ అవుతోంది. నేడు స్వల్పంగా క్షీణించి రూ.399 వద్ద క్లోజ్ అయింది.
టెక్ మహీంద్రా టార్గెట్ ధరరూ.1200 నుండి రూ.1500. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.1039 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఫైజర్ నేడు రూ.4800 వద్ద ముగిసింది. టార్గెట్ ధర రూ.5100.


Click it and Unblock the Notifications