ఇండస్ఇండ్ బ్యాంకు విజిల్ బ్లోయర్ కేసు, భారీ రిస్క్ కాకపోవచ్చు
ఇండస్ఇండ్ బ్యాంకులో రుణాల పునరుద్ధరణపై విజిల్ బ్లోయర్స్ ఆరోపణల నేపథ్యంలో ఈ బ్యాంకు షేర్ భారీగా పతనమైంది. సంస్థ వివరణ ఇచ్చినప్పటికీ నేటి కనిష్టస్థాయి నుండి కేవలం రెండు శాతం మాత్రమే పుంజుకొని, భారీ నష్టాల్లోనే ముగిసింది. ఈ బ్యాంకు స్టాక్ ఓ దశలో 12 శాతానికి పైగా కుంగాయి. బీఎస్ఈలో స్టాక్ ధర ఓ దశలో 12.40 శాతం కుంగి రూ.1,041.60కు చేరుకుంది. ఎన్‌ఎస్ఈలో రూ.12.40 శాతం పతమైంది. మధ్యాహ్నం 12:36 గంటల సమయంలో కనిష్ఠాల నుండి స్వల్పంగా కోలుకున్నప్పటికీ 10.52 శాతం నష్టంతో రూ.1,063.95 శాతం వద్ద ముగిసింది. ఇండస్ఇండ్ బ్యాంకు షేర్ 52 వారాల గరిష్టం రూ.1,242.00, 52 వారాల కనిష్టం రూ.735.05.

టెక్నికల్ లోపం కారణంగా
కస్టమర్ల సమ్మతి లేకుండా మే నెలలో 84,000 రుణాలు జారీ చేశామని, టెక్నికల్ లోపం కారణంగా ఇది జరిగిందని ఇండస్ఇండ్ బ్యాంక్ పేర్కొంది. ఈ పొరపాటు జరిగిన విషయాన్ని రెండు రోజుల్లో క్షేత్రస్థాయి సిబ్బంది గుర్తించిందని, వెంటనే ఆ తప్పిదాన్ని సరిదిద్దినట్లు తెలిపింది. లోన్ బుక్‌లో బకాయిలను తొలగించుకునే ఉద్దేశంతో బకాయిలు చెల్లించలేని రుణగ్రహీతలకు కొత్త రుణాలను బీఎఫ్ఐఎల్ మంజూరు చేసిందని ఇండస్‌ఇండ్ బ్యాంక్ యాజమాన్యానికి, ఆర్బీఐకి విజిల్ బ్లోయర్ లేఖ రాసినట్లుగా శుక్రవారం వార్తలు వచ్చాయి.

అంగీకారం లేకుండా
ఇండస్ఇండ్ బ్యాంక్ అనుబంధ సంస్థ BFIL సూక్ష్మరుణాలను ఇస్తుంది. ఈ కథనాలపై ఇండస్ఇండ్ బ్యాంకు స్పందించింది. రుణాల ఎవర్‌గ్రీనింగ్ ఆరోపణలను ఖండించింది. 2021 మే నెలలో ఓ టెక్నికల్ లోపం కారణంగా సుమారు 84,000 రుణాలు వినియోగదారు అంగీకారం లేకుండా మంజూరు అయ్యాయని పేర్కొంది. ఈ అంశాన్ని సమీక్షిస్తోంది.

మేజర్ రిస్క్ కాకపోవచ్చు
ఇండస్ఇండ్ బ్యాంకు రుణాలకు సంబంధించి విజిల్ బ్లోయర్ లేఖ నేపథ్యంలో స్టాక్స్ నేడు భారీగా నష్టపోయాయి. అయితే ఈ స్టాక్ పట్ల ఆందోళన అవసరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీ అషికా గ్రూప్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ అశుతోష్ మిశ్ర మాట్లాడుతూ... సంస్థ గురించి ఆందోళన అవసరం లేదని, స్టాక్‌లో రిస్క్ మరియు అస్థిరత మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. రిస్క్ దృక్కోణంలో స్టాక్ పెద్ద రిస్క్‌గా కనిపించడం లేదని అంటున్నారు. ఇండస్ఇండ్ బ్యాంకు మొత్తం పుస్తకంతో పోలిస్తే ఈ మొత్తం చిన్నదని అంటున్నారు.


Click it and Unblock the Notifications