భారీ లాభాల నుండి నష్టాల్లోకి మార్కెట్లు, ఈ స్టాక్స్ మాత్రం 15% జంప్

స్టాక్ మార్కెట్లు మంగళవారం (అక్టోబర్ 19) స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, కాసేపటికి నష్టాల్లోకి జారుకున్నాయి. అంతలోనే కోలుకొని, భారీ లాభాల్లో కనిపించాయి. దాదాపు 500 పాయింట్ల మేర లాభపడింది. చివరి గంటలో మళ్లీ నష్టాల్లోకి వెళ్లినప్పటికీ కాస్త కోలుకొని స్వల్ప నష్టాల్లో ముగిశాయి. తద్వారా మార్కెట్ లాభాల జోరుకు అడ్డుకట్ట పడింది. గత ఏడు సెషన్లలో దూకుడుగా కనిపించిన బుల్, మంగళవారం నాటి ట్రేడింగ్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొంది. గరిష్ఠ స్థాయిలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు స్వల్ప నష్టాలను చవిచూశాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్, రియాల్టీ స్టాక్స్ దెబ్బతీశాయి. రికార్డ్ గరిష్టాన్ని తాకిన అనంతరం సెన్సెక్స్ మళ్లీ పడిపోయింది.

62,000 పైకి చేరుకొని...

62,000 పైకి చేరుకొని...

దేశీయంగా ఉన్న బలమైన సానుకూల సంకేతాలతో నేటి ఉదయం సెన్సెక్స్, నిఫ్టీ ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 400 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సెన్సెక్స్ 62,000 మార్కును దాటింది. ఓ దశలో 62,245.43 వద్ద సరికొత్త గరిష్ఠాన్ని తాకింది. కానీ కాసేపటికి పరుగు తగ్గింది. గరిష్ఠస్థాయిలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో ఆరంభ లాభాలను కోల్పోయిన సెన్సెక్స్ నష్టాల్లోకి వెళ్లింది. రోజులో చాలావరకు లాభనష్టాల్లో ఊగిసలాడిన సూచీలు చివరకు 49.54 పాయింట్లు నష్టపోయి 61,716.05 వద్ద, నిఫ్టీ 58.30 పాయింట్లు దిగజారి 18,418.75 వద్ద క్లోజ్ అయింది.

సెన్సెక్స్ నేడు 62,156.48 పాయింట్ల వద్ద ప్రారంభమై, 62,245.43 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 61,594.29 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,602.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,604.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 18,377.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నేడు 600 పాయింట్ల మేర పైకి, కిందకు కదలాడింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, ITC, HUL, టెక్ మహీంద్రా ఉన్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో టెక్ మహీంద్రా 4.02 శాతం, లార్సన్ 3.22 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.13 శాతం, ఇన్ఫోసిస్ 1.67 శాతం, కొటక్ మహీంద్రా 1.18 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో ITC 6.32 శాతం, టాటా మోటార్స్ 5.44 శాతం, ఐచర్ మోటార్స్ 4.34 శాతం, HUL 4.04 శాతం, టైటాన్ కంపెనీ 4.01 శాతం నష్టపోయాయి.

15 శాతం లాభపడిన స్టాక్స్

15 శాతం లాభపడిన స్టాక్స్

నేడు పలు స్టాక్స్ 15 శాతం మేర లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ నేడు స్వల్ప నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. అయితే పలు స్టాక్స్ మాత్రం 15 శాతం మేర కూడా లాభపడ్డాయి. మెహాయ్ టెక్నాలజీ (20.0%), పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (20.0%), DRA కన్సల్టెంట్స్(19.98%), ది మందానా రిటైల్ (19.96%), అరిహంత్ ఫౌండ్(18.73%), స్పెషాలిటీ రెస్ట్ (18.12%), ఏవన్‌మోర్ క్యాపిటల్ (17.19%), బన్సాల్ రూపింగ్ ప్రోడక్ట్స్ (16.98%), L&T ఇన్ఫోటెక్ (15.93%), మనక్సియా కోటెడ్ (15.46%) లాభపడ్డాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+