మధ్యతరగతి బతుకులు డేంజర్ జోన్‌లోకి.. అప్పులు అడ్డుకోకుంటే భవిష్యత్తు అదోగతే..
Middle Class Turns to Loans: భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వృద్ధి, వినియోగదారుల కొనుగోళ్ల జోరు వెనుక తీవ్రమైన ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. మెరుగైన జీవనశైలి కోసం సులభంగా లభిస్తున్న చౌక రుణాలు, డిజిటల్ లెండింగ్ యాప్‌ల పుణ్యమా అని లక్షలాది మంది మధ్యతరగతి భారతీయులు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు. ఈ ఆర్థిక దుస్థితికి ఒక ఉదాహరణే 25 ఏళ్ల రెస్టారెంట్ ఉద్యోగి కిషోర్ ఉదంతం.
తన రూ. 50 వేల నెలసరి జీతంతో ఐఫోన్ కొనడానికి తీసుకున్న చిన్న రుణం క్రమంగా ప్లేస్టేషన్, టెలివిజన్, వైన్ కోర్సులు, విదేశీ ప్రయాణాల వరకు విస్తరించింది. త్వరలోనే ఆయన జీతంలో సగం భాగం కేవలం ఈఎంఐల చెల్లింపులకే సరిపోయింది. బిల్లుల కోసం బట్టలు కొనడం, జిమ్ సభ్యత్వాలు, వినోదాలను మానుకోవాల్సి వచ్చిందని తెలిపారు. నెలవారీ వాయిదాలు మొదట్లో సౌకర్యంగా అనిపిస్తాయి, కానీ తిరిగి చెల్లింపుల వలయంలో ఎంత త్వరగా చిక్కుకుపోతామో మనకు తెలియదని ఆయన వాపోయారు.

సెంట్రల్ బ్యాంక్ గణాంకాల ప్రకారం.. మార్చి నాటికి ముగిసిన సంవత్సరంలో గృహ రుణాలు ఏకంగా 36 శాతం పెరగడంతో, వినియోగదారుల రుణం జీడీపీలో రికార్డు స్థాయిలో 46 శాతానికి చేరింది. హాంకాంగ్ ఆధారిత బ్రోకరేజ్ సంస్థ CLSA అంచనాల ప్రకారం.. గృహ రుణాలను మినహాయిస్తే భారతీయ వినియోగదారులు ప్రపంచంలోనే అత్యంత రుణభారం గలవారిలో ముందున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లను పెంచుతుండటం, రాబోయే రోజుల్లో మరో 75-100 బేసిస్ పాయింట్ల పెంపు ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తుండటంతో ఈ రుణ భారం మరింత పెరిగే అవకాశం ఉంది. మార్సెల్లస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు సౌరభ్ ముఖర్జీ హెచ్చరించినట్లుగా.. పలుమార్లు జరిగే వడ్డీ రేట్ల పెంపు, బంగారం ధరల పతనం, వైట్-కాలర్ ఉద్యోగాల కోతలు అనే 'మూడు అగ్గిపుల్లలు' భారతీయ వినియోగదారుల వేడుకకు ముగింపు పలకగలవని తెలుస్తోంది.
ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులకు అనేక సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2025-26లో వినియోగదారుల ఆదాయం కంటే రుణాలు దాదాపు నాలుగు రెట్లు వేగంగా పెరుగుతుండగా, ఉద్యోగుల సగటు ఆదాయాలు వాస్తవ పరంగా 4% కంటే తక్కువగానే పెరిగాయి. ఆర్థిక అత్యవసర పరిస్థితులు మరియు అప్పులు తీర్చడం కోసం బంగారాన్ని తాకట్టు పెట్టే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రకారం, గత సంవత్సరంలో గోల్డ్ లోన్స్ దాదాపు 45% పెరిగాయి.
విజయవాడకి చెందిన ఆనంద్ (55) ఉదాహరణ ఇందుకు నిదర్శనం. కోవిడ్‌లో ఉద్యోగం కోల్పోయి, తల్లి వైద్య ఖర్చుల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఆయన పగటిపూట ఆఫీసు ఉద్యోగం ముగించుకుని, రాత్రిపూట ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేయాల్సి వస్తోంది. వివాహాలను వాయిదా వేసుకుంటూ, సంపాదనంతా వడ్డీలకే చెల్లిస్తున్న ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఇదేవిధంగా ఉంది.
రుణ లభ్యత సులభతరం కావడం, ముఖ్యంగా లక్ష రూపాయల కంటే తక్కువ చిన్న మొత్తాల రుణాలు డిజిటల్ లెండింగ్ ద్వారా కేవలం మూడు సంవత్సరాలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువగా పెరగడం పరిస్థితిని మరింత దిగజార్చింది. క్రెడిట్ కార్డులు, తక్షణ వ్యక్తిగత రుణాల (Instant Loans) ఆకర్షణలో పడి యువత ఆర్థిక భవిష్యత్తును ప్రమాదంలో నెట్టకుంటున్నారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే కాలంలో వడ్డీ రేట్లు మరింత పెరిగితే, ఈ అప్పుల ఊబి మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
