క్రిప్టోకరెన్సీ వైపు భారత యువత మొగ్గు, బంగారం కంటే ఇక్కడే ఎక్కువ
కరోనా మహమ్మారి తర్వాత గత ఏడాది కాలంగా క్రిప్టోకరెన్సీకి డిమాండ్ పెరిగింది. ఏడాదిలోనే క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ 700కు పైగా రెట్లు పెరిగి 65 వేల డాలర్ల స్థాయికి చేరుకుంది. అయితే టెస్లా అధినేత వ్యాఖ్యలు, టర్కీ, చైనా వంటి దేశాల నిర్ణయంతో బిట్ కాయిన్ సహా క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ పడిపోయింది. గత కొద్ది రోజులుగా క్రిప్టో కరెన్సీ అతి స్వల్ప పెరుగుదల, తగ్గుదలతో కదలాడుతోంది. సాధారణంగా మార్కెట్ నిపుణులు స్టాక్స్ పడిపోయిన సందర్భాల్లో కొనుగోలు చేయాలని సూచిస్తుంటారు. భారతీయులు క్రిప్టోకు ఇదే వర్తింప చేస్తున్నారు. బిట్ కాయిన్ సహా పలు క్రిప్టోకరెన్సీలను ఇటీవల భారీగా కొనుగోలు చేస్తున్నారు.

బంగారం నుండి బిట్ కాయిన్
భారతీయులు 25.000 టన్నుల బంగారంపై పెట్టుబడులు పెట్టారని, అదే సమయంలో గత ఏడాది కాలంలో క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు 200 మిలియన్ టన్నుల నుండి 40 బిలియన్ డాలర్లకు పెరిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది కాలంలో చాలామంది ఇన్వెస్టర్లు బంగారం నుండి బిట్ కాయిన్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ నుండి 32 ఏళ్ల రిచి సూద్ అనే ఇన్వెస్టర్ బిట్ కాయిన్, డోజి కాయిన్, ఏథెర్ వంటి వాటి పైన 1 మిలియన్ రూపాయల పెట్టుబడులు పెట్టారు.

డిజిటల్ వైపు అందుకే
ఇండియన్స్ డిజిటల్ కరెన్సీపై పెట్టుబడులు పెట్టడానికి ఏమాత్రం వెనుకాడటంలేదు. బంగారంపై కాకుండా క్రిప్టోపై పెట్టుబడులకు భారతీయులు ముందు ఉన్నారు. అలాగే, క్రిప్టోపై ఇన్వెస్ట్‌మెంట్ అత్యంత పారదర్శకంగా ఉంటుందని భావిస్తున్నారు. సాంప్రదాయ కరెన్సీని ఆయా దేశాల్లోని సెంట్రల్ బ్యాంకుల నియంత్రిస్తాయి. క్రిప్టో విషయంలో పూర్తిగా కొనుగోలు, అమ్మకాలు జరిపే వారి చేతుల్లో నియత్రంణ ఉంటుంది. దీంతో భారతీయులు ఎక్కువగా క్రిప్టోపై ఇన్వెస్ట్ చేస్తున్నారని అంటున్నారు.

యువతనే ఎక్కువ
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం మన దేశంలో ఎక్కువగా 18 ఏళ్ల నుండి 35 ఏళ్ల వయస్సు గల వారే ఎక్కువగా క్రిప్టోపై ఇన్వెస్ట్ చేస్తున్నారని చెబుతున్నారు. మన దేశంలో ప్రస్తుతం 19 క్రిప్టో ఎక్స్చేంజ్ మార్కెట్లు ఉన్నాయి. రానున్ను రోజుల్లో క్రిప్టోకు మరింత డిమాండ్ పెరుగుతుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications